Trisha Krishnan Confirmed : తమిళ సినిమా రంగానికి సంబంధించి కొత్త సినిమాలు రాబోతున్నాయి. యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్స్ తమ సత్తా చాటుతున్నారు. ప్రతిభా పాటవాలతో ఆకట్టుకుంటున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తలపతి విజయ్ నటించిన లియో రానుంది.
Trisha Krishnan Confirmed
ఇక ఇప్పటికే విడుదలైన నెల్సన్ దిలీప్ కుమార్ తీసిన రజనీకాంత్ నటించిన జైలర్ దుమ్ము రేపింది. ఏకంగా రూ. 600 కోట్లు వసూలు చేసింది. మరో వైపు లోకేష్ రజనీకాంత్ తో కొత్త సినిమా చేయబోతున్నట్లు సన్ పిక్చర్స్ ప్రకటించింది.
తాజాగా విదా ముయార్చీ సినిమాకు సంబంధించి మూవీ మేకర్స్ కీలక అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమా వచ్చే ఏడాదిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు. అజిత్ కుమార్ సరసన అందాల ముద్దుగుమ్మ త్రిష కృష్ణన్(Trisha Krishnan) నటించనుంది.
వీరితో పాటు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ , అర్జున్ దాస్ కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమాకు రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నాడు. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
ఇప్పటికే షూటింగ్ షెడ్యూల్ ఖరారు దర్శకుడు. ఈ సెప్టెంబర్ నెలలో అబుదాబిలో షూటింగ్ ప్రారంభమైంది. విదా ముయార్చి చిత్రానికి మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నాడు.
Also Read : SS Rajamouli Praises : జవాన్ టీంకు జక్కన్న కంగ్రాట్స్