Tripti Dimri: తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టిన యానిమల్ బ్యూటీ

తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టిన యానిమల్ బ్యూటీ

Hello Telugu - Tripti Dimri

Tripti Dimri: అర్జున్ రెడ్డి ఫేం సందీప్ వంగా దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్, రష్మిక హీరోహీరోయిన్లుగా అనిల్ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి డిమ్రి(Tripti Dimri) ప్రధాన పాత్రలో తెరకెక్కించిన సినిమా ‘యానిమల్‌(Animal)’. డిసెంబరు 1న విడుదలైన ఈ సినిమా సుమారు రూ. 700 కోట్లు వసూళ్ళతో రికార్డు సృష్టిస్తోంది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా జోయా పాత్రలో కనిపించిన నటి త్రిప్తి డిమ్రి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు.

‘యానిమల్‌’ సినిమా విడుదలైన వారం రోజుల్లో 24 లక్షల మంది ఇన్ స్టా ఫాలోవర్స్ ను సంపాదించుకోవడంతో పాటు పలు ఆఫర్లను కూడా అందుకున్నారు. అయితే ‘యానిమల్‌’ సినిమాలో తాను నటించిన సీన్స్ చూసి తన తల్లిదండ్రులు చాలా బాధపడ్డారని ఆమె ఇటీవల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో తెలిపారు. తొలిసారి ఈ సినిమా చూసినప్పుడు తన కుటుంబసభ్యులు ఎంతో బాధపడ్డారని చెప్పారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

Tripti Dimri – త్రిప్తి డిమ్రి ఏమన్నారంటే

‘‘ఇంటిమేట్‌ సీన్స్‌లో నేను యాక్ట్‌ చేయడం చూసి మా కుటుంబ సభ్యులు షాక్‌ అయ్యారు. ‘సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలను మేము ఎప్పుడూ చూడలేదు. నువ్వు ఇలాంటివి చేయకుండా ఉండాల్సింది. అయినా పర్వాలేదు. కాకపోతే మేము భాధపడుతున్నాం’ అని వాళ్ళు తనలో అన్నట్లు చెప్పుకొచ్చింది. అంతేకాదు ఆ సన్నివేశాల నుంచి తేరుకోవడానికి వాళ్లకు కాస్త సమయం పట్టింది.

అయితే నేను ఎలాంటి తప్పు చేయలేదని, ఇది నా వృత్తిలో భాగమని, సురక్షితం, సౌకర్యవంతంగా అనిపించినంత వరకూ నేను ఎలాంటి సీన్‌లోనైనా నటిస్తానన్నాను. ఎందుకంటే, నేనొక నటిని. పోషించే ప్రతి పాత్రకు వందశాతం న్యాయం చేయాల్సి ఉంటుంది. ఈ సినిమాలోనూ అదే చేశా అని ఇంట్లో వాళ్లకు చెప్పా’’ అని త్రిప్తి తెలిపారు. దీనితో కుటుంబ సభ్యులు అర్ధం చేసుకున్నారని తెలిపింది.

సినిమాలో ఆ సీన్ అవసరం కాబట్టి ఓకే చెప్పాను- త్రిప్తి

‘‘యానిమల్‌’ సినిమా కోసం దర్శకుడు సందీప్ నన్ను సంప్రదించినప్పుడే ఇందులో నాకూ రణ్‌బీర్‌కు మధ్య శృంగార సన్నివేశం ఉంటుందని చెప్పారు. బ్యూటీ అండ్‌ బీస్ట్‌ లాంటి ఇమేజ్‌ను క్రియేట్‌ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. ఆయన చెప్పింది విన్నాక సినిమాలో ఆ సీన్‌ చాలా అవసరమని అర్థమైంది. అందుకే, ఆ సీన్‌లో నటించడానికి నేను ఓకే చెప్పా. షూట్‌ సమయంలోనూ సందీప్‌ కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. సెట్‌లోకి ఎవరినీ అనుమతించలేదు. నటీనటులు కాకుండా సందీప్‌, సినిమాటోగ్రాఫర్‌ మాత్రమే షూట్‌లో పాల్గొన్నారు’’ అంటూ ఈ సీన్‌ మేకింగ్‌ గురించి త్రిప్తి ఇటీవల ఓ ఇంటర్వూలో చెప్పారు.

Also Read : Hero Allu Arjun: ‘హాయ్‌ నాన్న’ పై బన్నీ ఎమోషనల్ ట్వీట్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com