Directors Remuneration : భారతీయ సినిమా తన రూపు మార్చుకుంది. గతంలో సినిమాల బడ్జెట్ రూ. 100 కోట్లు ఉంటే గొప్ప. కానీ టెక్నాలజీ మారింది. ఇప్పుడు సినిమాల రేంజ్ పూర్తిగా రూ. 800 కోట్ల దాకా చేరుకుంది. ఇది రికార్డ్. హాలీవుడ్ ను పక్కన పెడితే అంతర్జాతీయ స్థాయిలో ఆకట్టుకునేలా ఇండియన్ మూవీస్(Indian Cinema) రెప రెప లాడుతున్నాయి. ఇక సినిమాలను పక్కన పెడితే వాటిని చిత్రీకరించే సత్తా, దమ్ము దర్శకులపై ఉంటుంది. రికార్డ్ బ్రేక్ సృష్టిస్తున్నారు. ఏకంగా రూ. 200 కోట్లను దాటేసేలా డైరెక్టర్స్ రెమ్యూనరేషన్(Directors Remuneration) కింద తీసుకోవడం విస్తు పోయేలా చేసింది. విచిత్రం ఏమిటంటే టాప్ దర్శకులలో బాలీవుడ్ దర్శకుల కంటే దక్షిణాది దర్శకులకే ఎక్కువ పారితోషకం తీసుకుంటున్నారు.
Directors Remuneration Sensational
ఇక సినిమాల పరంగా చూస్తే ఇటీవల నిర్వహించిన సర్వేలో టాప్ డైరెక్టర్స్ లలో ఎస్ఎస్ రాజమౌళి మొదటి స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం తను మహేష్ బాబుతో ఎస్ఎస్ఎంబీ29 పేరుతో ఇంటర్నేషనల్ లెవల్లో చర్చించుకునేలా తీస్తున్నాడు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. 2వ షెడ్యూల్ కొనసాగుతోంది. ఇందులో ప్రియాంక చోప్రా కీ రోల్ పోషిస్తోంది. తను తీసిన ఆర్ఆర్ఆర్ మూవీ రికార్డ్ బ్రేక్ చేసింది. తను సినిమాకు రెమ్యూనరేషన్ కింద రూ. 200 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్.
ఇక కోలీవుడ్ కు చెందిన దర్శకుడు అట్లీ నిలిచాడు. తను తీసింది కొన్ని సినిమాలే. షారుక్ ఖాన్ తో తీసిన జవాన్ సూపర్ హిట్ అయ్యింది. రూ. 1000 కోట్లు వసూలు చేసింది. తను రూ. 120 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్. ప్రస్తుతం అల్లు అర్జున్ తో సన్ పిక్చర్స్ నిర్మాణ సారథ్యంలో కొత్త మూవీకి శ్రీకారం చుట్టాడు. యానిమల్ మూవీతో రికార్డ్ బ్రేక్ చేసిన దర్శకుడు వంగా సందీప్ రెడ్డి. తన పారితోషకం ఏకంగా రూ. 150 కోట్లు ఉంటుందని అంచనా. రాజ్ కుమార్ హిరానీ రూ. 80 కోట్లు, సుకుమార్ రూ. 75 కోట్లు, సంజయ్ లీలా భన్సాలీ రూ. 55 నుంచి రూ. 65 కోట్లు తీసుకుంటున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక తారక్ తో తీస్తున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ సైతం భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని, కానీ ఆయన ఎంత తీసుకుంటున్నాడేది ఇంకా వెల్లడి కాలేదు.
Also Read : Hero Allu Arjun-Atlee :బన్నీ..అట్లీ మూవీ బడ్జెట్ రూ. 700 కోట్లు..?