Amardeep-Tejaswini : మరో షాక్ ఇచ్చిన టాలీవుడ్ కొత్త పెళ్లి జంట

ఆజంట ఎవరో కాదు అమర్ దీప్, తేజస్వి. ఈ జంట చాలా మందికి ఫెవరేట్...

Hello Telugu - Amardeep-Tejaswini

Amardeep : సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు పెళ్లిళ్లు, బ్రేకప్ లు, విడాకులు కామన్ అవుతున్నాయి. ఎవరు ఎప్పుడు విడాకులు తీసుకుంటున్నారో తెలియడం లేదు. సడన్ గా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టి షాక్ ఇస్తున్నారు. సమంత , నాగచైతన్య దగ్గర నుంచి చాలా మంది సెలబ్రెటీలు విడాకులు అనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు. రీసెంట్ గా ధనుష్- ఐశ్వర్య, అలాగే జయం రవి- ఆర్తి , జీవి ప్రకాష్ ఇలా చాలా మంది విడాకులు తీసుకుంటున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టి షాక్ ఇచ్చారు. సినిమా సెలబ్రెటీలతో పాటు సీరియల్ నటులు కూడా విడాకులు అనౌన్స్ చేస్తున్నారు. తాజాగా ఓ సీరియల్ జంట కూడా విడిపోతారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఆ జంట కూడా పెళ్లి తర్వాత హ్యాపీగా లేము అని చెప్పి షాక్ ఇచ్చారు. దాంతో ఫ్యాన్స్ అవాక్ అవుతున్నారు.

Amardeep-Tejaswini..

ఆజంట ఎవరో కాదు అమర్ దీప్(Amardeep), తేజస్వి. ఈ జంట చాలా మందికి ఫెవరేట్. మొగుడు పెళ్ళాలు అంటే ఇలానే ఉండాలి అని అందరూ అనుకునేలా చేశారు. ఎంతో అన్యుణ్యంగా ఉంటారు. అమర్ దీప్(Amardeep) బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తేజస్వి బయట చాలా కష్టపడింది. అమర్ దీప్ ను గెలిపించడానికి చాలా కష్టపడటంతో పాటు బయట ట్రోలింగ్ ను కూడా తట్టుకొని నిలబడింది.

తాజాగా జంట హ్యాపీగా లేరంటూ ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. రీసెంట్ గా ఓ టీవీ షోకు హాజరయ్యారు. పెళ్లి అనే థీమ్ తో సీరియల్ నటులు భార్యలతో కలిసి పెళ్లి గెటప్ లో వచ్చారు. అమర్ దీప్, తేజస్విని కూడా ఈ షోకు హాజరయ్యారు. ఈ షోకు ఓంకార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఓంకార్ అమర్, తేజస్విని మీరిద్దరూ భార్యాభర్తలుగా 100 పర్సెంట్ హ్యాపీగా ఉన్నారా? లేదంటే.. ఒక చైర్ వదిలేసి కూర్చోండి. అని చెప్పాడు దానికి ఇద్దరూ రెండు చైర్లు వదిలేసి కూర్చున్నారు. ఈ షో ప్రోమో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. నిజంగా ఈ ఇద్దరూ హ్యాపీగా లేరా.? లేక షో కోసమే ఇలా చెప్తున్నారా.? అన్నది చూడాలి.

Also Read : Hero Venkatesh : బాలయ్య ఇంటర్వ్యూలో కన్నీరు పెట్టుకున్న వెంకటేష్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com