Tollywood Directors : బాలీవుడ్‌కు మాస్ మంత్రం నేర్పిస్తున్నారు మన దర్శకులు. వాళ్ల దూకుడు చూస్తుంటే.. అక్కడున్న దర్శకులందరినీ పని లేకుండా చేసేలా కనిపిస్తున్నారు. సౌత్ నుంచి వచ్చాం అంటే చాలు.. ట్రాక్ రికార్డుతో పనిలేకుండా ఛాన్స్ ఇస్తున్నారు బాలీవుడ్ హీరోలు. తాజాగా జాట్ టీజర్‌లో సన్నీ డియోల్‌ను నెవర్ బిఫోర్ మాస్ అవతార్‌లో చూపించారు గోపీచంద్ మలినేని. సన్నీ డియోల్ గతంలోనూ చాలా మాస్ సినిమాలు చేసారు కానీ గోపీచంద్ మలినేని చూపించినంత స్టైలిష్‌గా ఎవరూ ప్రజెంట్ చేయలేదు. జాట్‌ను మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Tollywood Directors Movie Updates in BollywoodTollywood Directors
అలాగే యానిమల్‌తో హిందీ సినిమాకు సరికొత్త పాత్ బ్రేకింగ్ సినిమా ఇచ్చింది కూడా మన సందీప్ రెడ్డి వంగానే. సందీప్ వంగా టేకింగ్‌కు నార్త్ హీరోలంతా ఫిదా అవ్వడం కాదు.. సినిమాలో చెప్పినట్లు ఆయన విజన్‌కు పిచ్చోళ్లైపోయారు. ఇక సుకుమార్ గురించి ఏం చెప్పాలి..? ఈయన పుష్ప 2ను నెత్తిన పెట్టుకున్నారు నార్త్ ఆడియన్స్. లెక్కల మాస్టారు మాస్ బొమ్మకు ఉత్తరాది రాష్ట్రాలన్నీ ఊగిపోతున్నాయి. ఈ సినిమా బాలీవుడ్ వసూళ్ల వర్షం కురిపిస్తుంది. గతంలో బాహుబలితో రాజమౌళి, సాహూతో సుజీత్ సైతం బాలీవుడ్‌కు మాస్ మంత్రం చూపించారు. ఈ రెండు సినిమాలు బాలీవుడ్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించాయి. సాహూకి నార్త్ నుంచి వచ్చిన రెస్పాన్స్ పీక్స్.
Also Read : Oscars 2025 : ఆస్కార్ రేసు నుంచి తప్పుకున్న ‘లపతా లేడీస్’