Tollywood : గురువారం ఉదయం 10 గంటలకు అగ్ర నిర్మాత, TFDC ఛైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో టాలీవుడ్ ప్రముఖులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కలవనున్నారు. ఈ మీటింగ్ కి దిల్ రాజు తో పాటు చిత్ర పరిశ్రమ తరపున హీరోలు చిరంజీవి, వెంకటేష్, ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌తో పాటు పలువురు దర్శక నిర్మాతలు హాజరు కానున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట వివాదంతో ఇండస్ట్రీలో అనిశ్చితి ఏర్పడింది. దీనిపై చర్చించేందుకు ఈ మీటింగ్ కీలకం కానుంది. అలాగే సినీ పరిశ్రమ ఎదురుకుంటున్న సమస్యలపై చర్చించనున్నారు. ఇక ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ పాల్గొననున్నారు.
Tollywood Meet..
మరోవైపుసంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి ‘పుష్ప 2’ టీమ్ భారీగా పరిహారాన్ని చెల్లించేందుకు ముందుకు వచ్చింది. ఈ ఘటనలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను బుధవారం అల్లు అరవింద్, నిర్మాత దిల్ రాజు పరామర్శించారు. శ్రీతేజ్‌ని పరామర్శించిన అనంతరం.. శ్రీతేజ్ కుటుంబానికి రూ. 2 కోట్ల పరిహారం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు. నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా ఈ అమౌంట్‌ని శ్రీతేజ్ కుటుంబానికి ఇవ్వనున్నట్లు తెలిపారు.
Also Read : Prasanth Neel : ఎన్టీఆర్ తో చేయనున్న సినిమాపై చిన్న లీక్ వదిలిన డైరెక్టర్