Aparna Malladi : క్యాన్సర్ మహమ్మారి ఎందరో సినీ కళాకారులను ఇండస్ట్రీకి దూరం చేసింది. తాజాగా టాలీవుడ్ లేడీ డైరెక్టర్ అపర్ణ మల్లాది(54) క్యాన్సర్ పోరాటంలో ఓడిపోయారు. ఆమె కొన్ని రోజులుగా అమెరికాలోని ఏంజెల్స్‌లో చికిత్స పొందుతున్నారు. నేడు ఆమె శరీరం చికిత్సకి సహకరించకపోవడంతో ఆమె మృతి చెందారు.
Aparna Malladi No More..
అపర్ణ మల్లాది.. డైరెక్టర్, రైటర్, ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలో వ్యవహరించారు. ఆమె ‘ది అనుశ్రీ ఎక్స్ పెరిమెంట్స్’ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇది ప్రేక్షకులని పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో ఆమె కొంత గ్యాప్ తీసుకొని పోష్ పోరిస్ అనే వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. ఈ సిరీస్ కి మంచి ఆదరణ లభించింది. తర్వాత.. ‘పెళ్లి కూతురు పార్టీ’ అనే సిరీస్ తో మెప్పించారు. కేవలం డైరెక్టర్ గానే కాకుండా ఇండస్ట్రీలో ఉత్తమ నటులను రూపొందించడంలో ఆమె కీలక పాత్ర వహించారు. కేరాఫ్ కంచరపాలెం లాంటి అవార్డు విన్నింగ్ సినిమాలకు తెరపై రావడానికి అపర్ణ ఎంతో దోహహదపడ్డారు. అపర్ణ మృతిపట్ల సినీప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
Also Read : Chinmayi Sripada : మగవాళ్ళు శృంగారం చేయడంపై సింగర్ చిన్మయి సంచలన వ్యాఖ్యలు