Actress Sneha : టాలీవుడ్ హీరోయిన్ స్నేహ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అడియన్స్ హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. గ్లామర్ షోలకు దూరంగా ఉంటూనే ట్రెడిషనల్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించింది. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకున్న స్నేహ(Actress Sneha).. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన స్నేహ(Actress Sneha).. కుర్రహీరోహీరోయిన్లకు వదినగా, అక్క పాత్రలలో నటిస్తుంది. అలాగో అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన ఫ్యామిలీ ఫోటోస్, క్రేజీ ఫోటోషూట్స్ షేర్ చేస్తుంటుంది. ఇటీవలే చీరల వ్యాపారంలోకి అడుగుపెట్టింది.
Actress Sneha Comment
ఇటీవల ఇండస్ట్రీలో స్టార్ కపూల్స్ డివోర్స్ తీసుకోవడంపై అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. జయం రవి-ఆర్తి, జివి ప్రకాష్-సైంధవి, ఏఆర్ రెహమాన్-సైరా బాను ఇంకా చాలా మంది తారలు తమ వివాహ బంధాన్ని ముగించారు. ఈ మధ్య కాలంలో మరికొంత మంది స్టార్ కపూల్ గురించి కూడా అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. అందులో సూర్య -జ్యోతిక, స్నేహ – ప్రసన్న జంటలు. తాజాగా సినీ పరిశ్రమలో జరుగుతున్న విడాకుల వార్తలపై స్నేహ, ఆమె భర్త ప్రసన్న స్పందించారు.
స్నేహాలయం పేరుతో కొత్తగా చీరల వ్యాపారం స్టార్ట్ చేసింది స్నేహ. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో జరుగుతున్న డివోర్స్ వార్తల గురించి ఏమనుకుంటున్నారు అని ప్రశ్నించగా.. “విడాకులు వ్యక్తిగత నిర్ణయం. ప్రతి ఒక్కరు జీవితంలో ఎలాంటి పరిస్థితులను అనుభవిస్తున్నారో మనకు తెలియదు. అందువల్ల ఈ విషయంపై స్పందించే అధికారం మాకు లేదు” అని స్నేహ అన్నారు. 2009 నుంచి ప్రేమలో ఉన్న స్నేహ, ప్రసన్న 2012లో పెళ్లి చేసుకున్నారు.
Also Read : Sam CS : పుష్ప 2 మ్యూజిక్ పై స్పందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోరర్