Game Changer : శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్, కియారా అద్వానీ కలిసి నటించిన గేమ్ ఛేంజర్(Game Changer) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత చెర్రీ నటించిన చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినీ అభిమానుల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభించింది. అయితే ఈ మూవీలో తండ్రీ కొడుకులుగా నటించారు రామ్ చరణ్. తన సినీ కెరీర్ లో ఇదే తొలి సినిమా కావడం విశేషం.
Game Changer Movie Updates
శంకర్ తీసే ప్రతి సినిమా వెనుక ఓ నేపథ్యం ఉంటుంది. ప్రత్యేకించి కథ పూర్తిగా సామాజిక కోణాన్ని కలిగి ఉంటుంది. భారతీయుడు సినిమాలో హీరో అవినీతిని ప్రశ్నించి, అంతం చేసే పాత్రలో కమల్ హాసన్ కెరీర్ లోనే మైలురాయిగా నిలిచి పోయేలా చేశాడు.
తాజాగా గేమ్ ఛేంజర్ మూవీలో రామ్ చరణ్ ను ఐఏఎస్ పాత్రకు ఎంపిక చేశాడు. నిజాయితీ కలిగిన ఆఫీసర్ కథ ఇది. ఈ సినిమాకు స్పూర్తి తమిళనాడుకు చెందిన దివంగత , మాజీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ టీఎన్ శేషన్. తను ఎన్నికల అధికారిగా దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయే సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడు.
తను ఉన్నంత కాలం అప్పటి ప్రభుత్వాలు వణికి పోయాయి. ఒక నిజాయితీ కలిగిన ఆఫీసర్ తలుచుకుంటే ఏమైనా చేయొచ్చని నిరూపించాడు ఆయన. తననే ఇన్సిపిరేషన్ గా శంకర్ తీసుకుని గేమ్ ఛేంజర్ ను రూపొందించాడని టాక్.
Also Read : Dynamic CM Revanth : సీఎం రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా టూర్ రద్దు