Samantha Citadel: సమంత వెబ్ సిరీస్ కు ‘సిటాడెల్‌: హనీ బన్నీ’ టైటిల్ ఖరారు !

సమంత వెబ్ సిరీస్ కు 'సిటాడెల్‌: హనీ బన్నీ' టైటిల్ ఖరారు !

Hello Telugu - Samantha Citadel

Samantha Citadel: ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’, ‘ఫర్జీ’ లాంటి విజయవంతమైన వెబ్ సిరీస్‌ లను అందించిన రాజ్‌ అండ్‌ డీకే రూపొందిస్తున్న మరో స్పై యాక్షన్‌ సిరీస్‌ ‘సిటాడెల్‌’. అమెరికన్ ‘సిటాడెల్‌’ను భారతీయులకు అందించేందుకు ఇండియన్ వెర్షన్ గా తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ లో బాలీవుడ్ హీరో వరుణ్‌ ధావన్‌, దక్షిణాది అగ్రతార సమంత జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్… ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ‘సిటాడెల్‌’ ఇండియన్ వెన్షన్ కు ‘సిటాడెల్‌: హనీ బన్నీ’ అనే టైటిల్‌ని ఖరారు చేస్తూ పోస్టర్‌ని విడుదల చేసింది వెబ్ సిరీస్ నిర్మాణ సంస్థ. బాలీవుడ్ కు చెందిన ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిర్వహించిన ప్రైమ్ వీడియో ప్రెజెంట్స్ కార్యక్రమంలో ఈ ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు.

Samantha Citadel Updates

ఈ సందర్భంగా సమంత(Samantha) మాట్లాడుతూ… ‘నేనింతగా యాక్షన్‌ చేస్తానని ఏనాడూ ఊహించలేదు. కనీసం ఇందులో భాగమవుతానని చివరిక్షణం వరకూ అనుకోలేదు. ఈ సిరీస్‌ కోసం శారీరకంగా ఎంతో శ్రమించా. రాజ్‌, డీకే చాలా ప్రతిభావంతులైన దర్శకులు. అమెరికన్‌ ‘సిటాడెల్‌’ని భారతీయ ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది. ‘ఇదొక అద్భుతమైన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌. ఇందులోని సన్నివేశాలు, ప్రేమకథ ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి’ అని తెలిపింది వెబ్ సిరీస్‌ నిర్మాణ బృందం. కే కే మేనన్‌, సిమ్రాన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ ప్రాజెక్టు అమెజాన్‌ ప్రైమ్‌లో త్వరలో విడుదల కానుంది. దక్షిణాదిలో అగ్రతారగా ఉన్న సమంత(Samantha)… ఎవరూ ఊహించని రీతితో ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ పార్ట్ 2లో నటించింది. విలన్ తరహా పాత్రలో నటిస్తూ ఇంటిమేట్ సీన్లలో కూడా నటించి అందరినీ ఆశ్చర్యపరచింది. ఇప్పుడు మరోసారి అదే బ్యానర్ లో తెరకెక్కించిన ‘సిటాడెల్‌: హనీ బన్నీ’ యాక్షన్ తో ప్రేక్షకులను మెప్పించడానికి వస్తోంది.

Also Read : Ram Charan: విశాఖ బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్ కుటుంబం !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com