Amniotic fluid : ప్రస్తుం చాలా మంది గర్భిణీలు ఎదురుకుంటున్న సమస్య ఉమ్మనీరు లేకపోవడం. తల్లి కడుపులో బిడ్డ ఆరోగ్యవతంగా ఉండటానికి ఉమ్మనీరు చాలా అవసరం. ఇన్ఫెక్షన్లు, ఒత్తిడి, దెబ్బల నుంచి బిడ్డను ఉమ్మనీరు రక్షిస్తుంది.
అయితే ఉమ్మనీరు తగినంత లేకపోయినా లేదా ఎక్కువైనా తల్లీ బిడ్డలకు సమస్యలు మొదలవుతాయి. నెలలు నిండుతున్న కొద్దీ ఉమ్మనీరు తగ్గుతూ వస్తుంది. ఉమ్మనీరు తక్కువ అవుతే బిడ్డకు రక్తప్రసరణ సరిగా జరగదు. దీంతో త్వరగా ప్రసవం చేయాల్సిన పరిస్థి ఏర్పడవచ్చును.
Amniotic fluid :
అయితే ఉమ్మనీరు పరగాలంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఉమ్మనీరు పెరగాలంటే కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగాలి. దీంతో పోషకాలు లభించడమే కాకుండా ఉమ్మనీరు పెరుగుతుంది.ఉమ్మనీరు పెరగాలంటే సరిపడ నీళ్లు తాగాలి. తాజా పండ్ల రసాలు ఎక్కువగా తీసుకుంటే ఉమ్మనీరు వేగంగా వృద్ధి చెందుతుంది.
నీటి శాతం ఎక్కువగా ఉండే కీరా, పాలకూర, బ్రకోలీ, టమాటా, క్యాలీఫ్లవర్, క్యారెట్‌తోపాటు ద్రాక్ష, దానిమ్మ వంటి పండ్లు తీసుకోవడం ఆరోగ్యానికి మంచింది.
Also Read : Turmeric milk : పసుపు కలిపిన పాలు తాగుతున్నారా?