టాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ ఉన్న నటుడు మాస్ మహరాజా రవి తేజ. పవర్ ఫుల్ పాత్రలు ఉన్న వాటినే మనోడు ఎంచుకుంటాడు. కథ నచ్చితే దర్శకుడు ఎవరు అనేది పట్టించుకోడు. సక్సెస్ తో పని లేకుండా పని చేసుకుంటూ పోవడమే తన నైజం ఇప్పటికే ప్రకటించాడు. ఇండస్ట్రీలో అసిస్టెంట్ గా ప్రారంభమై ఇప్పుడు టాప్ హీరోల లిస్టులోకి చేరి పోయాడు.
శ్రీలీలతో కలిసి చేసిన ధమాకా మూవీ రికార్డ్ బ్రేక్ చేసింది. ఆయన చిత్రాలన్నీ డిఫరెంట్ గా ఉంటాయి. తాజాగా మరో సినిమాతో ముందుకు వస్తున్నాడు రవితేజ. అదే టైగర్ నాగేశ్వర రావు. కొత్త దర్శకుడు వంశీతో కలిసి చేస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
పవర్ ఫుల్ పాత్రలో దుమ్ము రేపుతున్నాడు రవితేజ. మాస్ లుక్స్ తో అదుర్స్ అనిపించేలా ఉండడంతో సినిమాపై ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా మూవీ మేకర్స్ టైగర్ నాగేశ్వర రావు సినిమా ట్రైలర్ విడుదల చేశారు.
ఇందులో నుపుర్ సనన్ , గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ , మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. జీవి ప్రకాశ్ దీనికి మ్యూజిక్ ఇచ్చారు. దసరా కానుకగా రానుంది.