సల్మాన్ ఖాన్ , కత్రీనా ఖైఫ్ కలిసి నటించిన టైగర్ 3 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు మనీష్ శర్మ దర్శకత్వం వహించారు. రచన, స్క్రీన్ ప్లే శ్రీధర్ రాఘవన్ నిర్వహించారు. అంకుర్ చౌదరి మాటలు రాశారు.
ఆదిత్యా చోప్రా నిర్మించారు. ఈ మూవీలో ఇమ్రాన్ హష్మి కూడా నటించారు. అనాయ్ గోస్వామి ఛాయా గ్రహణం అందించారు. ప్రీతమ్ సంగీతం అందించారు.
యష్ రాజ్ ఫిలిమ్స్ టైగర్ 3 చిత్రాన్ని నిర్మించారు. ఈ ఏడాది నవంబర్ 10న విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ఫిక్స్ చేశారు. దీనిని పాన్ ఇండియా మూవీగా తీర్చి దిద్దాడు డైరెక్టర్ . మొత్తం సినిమా నిడివి 122 నిమిషాలు ఉండనుంది.
సల్మాన్, కత్రీనా కైఫ్ కలిసి నటించిన టైగర్ 4 చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళంలో కూడా రానుంది. భారీ బడ్జెట్ తో సినిమాను తీశారు. ఏకంగా రూ. 300 కోట్లు ఖర్చు చేశారు. సల్మాన్ ఖాన్ ఈ సినిమాపై భారీ నమ్మకం పెట్టుకున్నాడు.
అశు తోష్ రాణా, అనుప్రియా గోయెంకా ప్రధాన పాత్రలలో నటించారు. దీపావళి కానుకగా దేశ వ్యాప్తంగా విడుదల కానుంది ఈ సినిమా.