Tiger 3 Movie : అందరి కళ్లు బాలావుడ్ కింగ్ సల్మాన్ ఖాన్ పైనే ఉన్నాయి. ఇప్పటికే జనాదరణ పొందిన ఈ నటుడు తను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన టైగర్ -3 పై అంచనాలు పెట్టుకున్నాడు. ఈ ఏడాది తన పోటీదారుడు బాద్ షా షారుక్ ఖాన్ నటించిన రెండు సినిమాలు రూ. 1,000 కోట్లు దాటాయి.
Tiger 3 Movie Updates
దీంతో తన చిత్రం కూడా ఆరంభం నుంచే అదుర్స్ అనిపించేలా కలెక్షన్లు ఉండాలని ఆరాట పడుతున్నాడు. ఇప్పటికే భారీ హైప్ వచ్చేసింది ఈ మూవీపై. టైగర్ జిందా హై అన్న ట్యాగ్ లైన్ ఎప్పటి నుంచో పాపులర్ అయ్యింది. టైగర్ చిత్రానికి ఇది సీక్వెల్. బ్లాక్ బస్టర్ మూవీగా చరిత్ర సృష్టించింది.
ఇదిలా ఉండగా ఇండియాతో పాటు ఓవర్సీస్ లో టైగర్ -3(Tiger 3) చిత్రానికి సంబంధించి ముందస్తు బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. భారీ ఎత్తున ఫ్యాన్స్ ఎగబడి కొంటుండడం విశేషం. మూవీ మేకర్స్ అంచనాల ప్రకారం కనీసం తొలి రోజే రికార్డు నమోదు చేయడం ఖాయమని నమ్ముతున్నారు. రూ. 100 కోట్లకు పైగానే వసూలు కావచ్చని అంచనా వేస్తున్నారు.
ఇందులో పోరాట సన్నివేశాలు, యాక్షన్ సీన్స్ ,రొమాన్స్ సమపాళ్లలో తీయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఇక సల్మాన్ ఖాన్ కు పోటీగా అందాల తార కత్రీనా కైఫ్ కూడా నటించింది. మొత్తంగా టైగర్ -3 మూవీ దీపావళి పండుగ వేళ రానుంది. ఏ మేరకు అంచనాలు అందుకుంటుందో వేచి చూడాలి.
Also Read : Sana Raees Khan : అందరి కళ్లు సనా ఖాన్ పైనే