Thug Life Kamal : భారతీయ సినీ జగత్తులో ప్రతిభావంతుడైన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు మణిరత్నం. తను తీసినవి కొన్నే చిత్రాలు కావచ్చు. కానీ సెల్యూలాయిడ్ మీద ఎవర్ గ్రీన్ . ఆనాడు రోజా, దిల్ సే నుంచి నేటి పొన్నియన్ సెల్వన్ దాకా దేనికదే . అతడి వద్ద ఛాన్స్ లభిస్తే చాలు అనుకునే వాళ్లు ఎందరో. రెమ్యూనరేషన్ లేక పోయినా పర్వాలేదు తనతో వర్క్ చేయాలని కలలు కంటున్న హీరోయిన్లు లేక పోలేదు.
Thug Life Kamal Movie
మణి రత్నం లోక నాయకుడు కమల్ హాసన్ తో సినిమా తీస్తే ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇద్దరి కాంబినేషన్ లో మరో గ్యాంగ్ స్టర్ మూవీకి తెర లేపారు. ఇందుకు సంబంధించిన స్టిల్స్, పోస్టర్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రత్యేకించి కమల్ హాసన్(Kamal Hasan) ను తీర్చిదిద్దిన తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.
ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మణి రత్నం దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో కమల్ హాసన్ తో పాటు దుల్కర్ సల్మాన్ , త్రిష, జయం రవి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటి దాకా పేరు ప్రకటించకుండా ఉన్న మణిరత్నం ఉన్నట్టుండి డిక్లేర్ చేశాడు. థగ్ లైఫ్ అని పేరు పెట్టాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తోంది. కమల్ హాసన్ కెరీర్ లోనే ఇది ది బెస్ట్ మూవీగా ఉండబోతోందని చెప్పడంలో సందేహం లేదు.
Also Read : Kajal Agaarwal : దీపావళికి “సత్యభామ” టీజర్