Karnataka : ఇక దెయ్యాలు అంటే చాలా మందికి భయం. కానీ ఆస్టోరీలు వినడం చాలా ఇష్టం. అయితే కొంత మంది దెయ్యాలు ఉన్నాయంటే, మరికొందరు అలాంటివి ఏవీ లేవు అంటారు. కానీ నిజంగా దెయ్యాలను చూడాలంటే కర్ణాటకకు వెళ్లాల్సిందే అంటున్నారు పర్యాటకులు.
అసలు విషయంలోకి వెళ్లితే.. కర్ణాటక(Karnataka)లో చాలా భయానక ప్రదేశాలు ఉన్నాయంట. అక్కడ సూర్యుడు అస్తమించిన తర్వాత చాలా మంది తిరగడానికి భయపడుతారు. కాగా, ఆ హాంటెడ్ ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
hunted places in Karnataka :
విక్టోరియా హాస్పిటల్
విక్టోరియా ఆసుపత్రి గురించి అక్కడి ప్రజలు కథలు కథలుగా ముచ్చటిస్తుంటారు. ఈ ఆసుపత్రి చికిత్స అందించే ప్రదేశం కాదు. ఆసుపత్రి ఆవరణలోని చెట్టుపై తెల్లటి బొమ్మ కనిపించిందని పలువురు పేర్కొంటున్నారు.
కల్పల్లి శ్మశానవాటిక
కర్ణాటకలోని బెంగళూరులోని కల్పల్లి శ్మశానవాటిక గురించి ఎన్నో కథలు ఉన్నాయి. అక్కడికి వెళ్లాలంటే చాలా మంది భయపడుతారంట. అంతే కాకుండా ఆ శ్మశాన వాటిక చుట్టూ ఏడుపులు వినిపిస్తాయంట. ఇవే కాకుండా కర్ణాటకలో ఇలాంటి ప్రదేశాలు చాలానే ఉన్నాయంట.
NH4 హైవే (NH4 హైవే)
కర్నాటక రాష్ట్రంలోని ఒక రహదారి, ఇది ఎప్పుడూ ఏదో ఒక భయానక కథనం కోసం చర్చలో ఉంటుంది. అవును.. రాత్రి వేళల్లో ఓ మహిళ హైవేపై లిఫ్ట్ అడుగుతుందని, డ్రైవర్ కారు ఆపడంతో ఆ మహిళ కనిపించకుండా పోయిందని పలువురు అంటున్నారు. లిఫ్ట్ ఇచ్చిన వాహనాలు కూడా ప్రమాదాలకు గురవుతున్నాయని చెబుతున్నారు.
Also Read : Crying : అమ్మాయిలు రాత్రిల్లే ఎందుకు ఏడుస్తారో తెలుసా?