Theppa Samudram : తెప్ప సముద్రం సినిమా నుంచి పెంచల్ దాస్ రాసి పాడిన సరికొత్త గీతం

ఈ పాటలో మృగాలు వెంటాడుతున్న ఆడపిల్లల బాధ, రోదనలు మీ హృదయాన్ని కదిలించేలా ఉంటుంది

Hello Telugu - Theppa Samudram

Theppa Samudram : చైతన్యరావు(Chaitanya Rao), అర్జున్ అంబటి హీరోలుగా, కిషోరి దాత్రక్ హీరోయిన్ గా రవిశంకర్ నిర్మించిన చిత్రం ‘తెప్ప సముద్రం’. సతీష్ లాపాలు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్లిమాని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నీలకంటి మంజుల రాఘవేంద్ర గౌడ్ నిర్మించగా, బేబీ వైష్ణవి సమర్పణలో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు పి.ఆర్. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 12న థియేటర్లలో విడుదల చేయనున్నారు.

Theppa Samudram Movie Song Viral

ఈ చిత్రం నుండి పెంచల్ దాస్ రచించి, పాడిన “నా నల్ల కలువ పువ్వా” అనే కొత్త పాట MRT మ్యూజిక్ ద్వారా విడుదలైంది. ఈ పాటలో మృగాలు వెంటాడుతున్న ఆడపిల్లల బాధ, రోదనలు మీ హృదయాన్ని కదిలించేలా ఉంటుంది. పాట మొత్తం చాలా ఎమోషనల్ గా సాగుతుంది.

నిర్మాత రాఘవేందర్ గౌడ్ మాట్లాడుతూ… దర్శకుడు సతీష్ చెప్పిన కథ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులు కూడా మా సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాం.

దర్శకుడు సతీష్ లపాలు మాట్లాడుతూ… తెప్ప సముద్రం సినిమా చాలా బాగా వచ్చింది. మా నిర్మాత రాఘవేందర్ ఎలాంటి రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా మీ ముందుకు రానుంది. ప్రేక్షకులకు నచ్చే మంచి కమర్షియల్ సినిమా అవుతుంది.

Also Read : Love Me : ఒళ్ళు గగుల్పొడిచే హర్రర్ కాదాంశంతో తెరకెక్కుతున్న ‘లవ్ మీ ఇఫ్ యు డేర్’

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com