The Trial : అతనో డిప్యూటీ జైలర్… సుమారు పది సంవత్సాల పాటు వివిధ జైళ్ళ శాఖలో డిప్యూటీ జైలర్ గా పనిచేసి ఎంతోమంది నేరస్తులు, ముద్దాయిలను, విచారణాధికారులను దగ్గరనుండి చూసారు. వివిధ నేరాలు చేసి శిక్ష అనుభవిస్తున్న ఎంతోమంది నేరస్తుల కన్నీటి కథలను విన్న డిప్యూటీ జైలర్… ఉద్యోగ సమయంలో తాను చూసిన కేసులనే కథలుగా మలచుకుని దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నారు. డిప్యూటీ జైలర్ పదవికి రాజీనామా చేసి డైరెక్టర్ గా మెగా ఫోన్ పట్టి… మొదటి ప్రాజెక్టు ‘ది ట్రయల్’ తో నవంబరు 24న ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు యువ దర్శకుడు రామానాయుడు గన్ని.
The Trial – ఖైదీల కథలనే స్ట్రిప్ట్ గా మలచిన డిప్యూటీ జైలర్
ఓ కేసు విచారణ నేపథ్యంలో తెరకెక్కిన మొదటి తెలుగు సినిమా ‘ది ట్రయల్’. స్పందన పల్లి, యుగరామ్, వంశీ కోటు ప్రధాన పాత్రలో స్మృతి సాగి, శ్రీనివాస నాయుడు కిల్లాడ నిర్మించిన ఈ చిత్రానికి డిప్యూటీ జైలర్ గా పదవీ విరమణ చేసి.. సినిమాలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చిన రామానాయుడు గన్ని దర్శకత్వం వహించారు. ఇంటరాగేషన్ ఇతివృత్తంగా సాగే ఈ కథను… దర్శకుడు రామ్ గన్ని ఇంటరాగేషన్ గదిలోనే ప్రారంభమై.. అక్కడే ముగుస్తుంది. ఓ మహిళా ఎస్సై… తన భర్తతో పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటుండగా జరిగిన సంఘటన చుట్టూ తిరిగే కథ ‘ది ట్రయల్(The Trial)’. ఓ విచారణాధికారి, ఓ ఎస్సైకు మధ్య జరిగే కేసు విచారణ ఎంత బలంగా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేసారు దర్శకుడు రామ్ గన్ని.
‘ది ట్రయల్’ తో డైరెక్టర్ గా మారిన డిప్యూటీ జైలర్ రామ్ గన్ని
విశాఖ జిల్లాకు చెందిన రామానాయుడు గన్ని… జైళ్ళ శాఖలో సుమారు పదేళ్ళపాటు డిప్యూటీ జైలర్ గా పనిచేసారు. కాలేజీ చదువుతున్న రోజుల నుండే సినిమాలపై ఆశక్తి కలిగిన రామానాయుడు… ఇటీవల తన ఉద్యోగానికి రాజీనామా చేసి… సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. సెహరి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన రామానాయుడు… అదే సమయంలో వర్గో పిక్ఛర్స్ తో ఓ వెబ్ సిరీస్ నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రస్తుతం ‘ది ట్రయల్’ తో ప్రేక్షుకుల ముందుకు వస్తున్నారు. జీ5 సంస్థతోనూ ఓ ప్రాజెక్టుకు ఒప్పందం కుదుర్చుకున్న రామ్ గన్ని… డార్క్ హ్యూమర్ తో కూడిన కథను సిద్ధం చేస్తున్నారు.
Also Read : Mangalavaaram: ‘మంగళవారం’ కు భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ దెబ్బ