The Raja Saab : ‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాల సక్సెస్ తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న చిత్రం ‘రాజాసాబ్(The Raja Saab)’. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ నాయికలు. చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. మిగిలిన షూటింగ్‌ను వేగంగా పూర్తి చేయడానికి మారుతీ టీమ్ కృషి చేస్తోంది. అయితే సినిమా సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న విడుదల కావాల్సి ఉంది. కానీ.. అప్పుడు కష్టమే అని ఇండస్ట్రీ టాక్ వినిపిస్తోంది.
The Raja Saab Movie Updates
జనవరి నాటికి చిత్రీకరణ ముగించే దిశగా సినీ యూనిట్ ప్లాన్ చేసింది. సంక్రాంతి సందర్భంగా మొదటి పాటను విడుదల చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్. కామెడీ, హారర్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రెండు విభిన్న కోణాల్లో కనువిందు చేయనున్నారు. దీంతో ఈ సమ్మర్.. కూలెస్ట్ సమ్మర్ అవుతుందని ప్రభాస్ ఫ్యాన్స్ భావించారు. కానీ మూవీ రిలీజ్ వాయిదా పడే అవకాశాలున్నాయని పక్కా సమాచారం ఉండటంతో ప్రభాస్ ఫ్యాన్స్‌కి కాస్త నిరాశే ఎదురవనుంది. ప్రభాస్ నటిస్తున్న ఇతర చిత్రాల విషయానికొస్తే.. ‘సలార్ 2’ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అలాగే ‘కల్కి 2’ వర్క్ కూడా జరుగుతోంది. అయితే ఇప్పటికే కల్కి 2కి సంబంధించి 35 శాతం చిత్రీకరణ పూర్తయిందని ఇటీవల నిర్మాతలు వెల్లడించిన సంగతి తెలిసిందే.
Also Read : Samantha : నెట్టింట తెగ వైరల్ అవుతున్న సమంత పోస్ట్