The Raja Saab : ‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాల సక్సెస్ తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న చిత్రం ‘రాజాసాబ్(The Raja Saab)’. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ నాయికలు. చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. మిగిలిన షూటింగ్‌ను వేగంగా పూర్తి చేయడానికి మారుతీ టీమ్ కృషి చేస్తోంది. వచ్చే నెలలో యూరప్‌లో ఓ పాటను చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మారుతి టీమ్ నుంచి సమాచారం. ప్రభాస్, మాళవిక మీద సాగే డ్యూయట్ సాంగ్ అని తెలిసింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో జనవరి నాటికి చిత్రీకరణ ముగించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా మొదటి పాటను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కామెడీ, హారర్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రెండు విభిన్న కోణాల్లో కనువిందు చేయనున్నారు.
The Raja Saab Movie Updates
ప్రభాస్‌నటిస్తున్న ఇతర చిత్రాల విషయానికొస్తే.. ‘సలార్ 2’ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అలాగే ‘కల్కి 2’ వర్క్ కూడా జరుగుతోంది. అయితే ఇప్పటికే కల్కి 2కి సంబంధించి 35 శాతం చిత్రీకరణ పూర్తయిందని ఇటీవల నిర్మాతలు వెల్లడించిన సంగతి తెలిసిందే.
Also Read : Sobhitha Dhulipala : మరోసారి తన రేంజ్ ఏంటో చూపించిన శోభిత