ఉత్కంఠ రేపుతున్న ‘‘ది రైల్వే మెన్’’ వెబ్ సిరీస్
The Railway Men : వేలాది మంది ప్రాణాలను తీయడమే కాకుండా లక్షలాది మంది అనారోగ్యానికి కారణమైన భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఇతివృత్తంగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ‘‘ది రైల్వే మెన్’’ వెబ్ సిరీస్ ఉత్కంఠ రేపుతోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన మొట్టమొదటి వెబ్ సిరీస్ కావడంతో పాటు 2014 తరువాత ఇప్పటి వరకు దీనిపై సినిమాలు రాకపోవడంతో ‘ది రైల్వే మెన్’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మాధవన్(Madhavan) ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో కేకే మేనన్, దివ్యేందు, బాబిల్ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు.
The Railway Men- భోపాల్ గ్యాస్ దుర్ఘటనపై రెండు సినిమాలు వచ్చినా వెబ్ సిరీస్ కు తగ్గని క్రేజ్
1984 డిసెంబర్ 2న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ (యుసిఐఎల్) పెస్టిసైడ్ ప్లాంట్‌లో మిథైల్ ఐసోసనియేట్ రసాయనం లీకై వేలమంది చనిపోగా లక్షల మంది అస్వస్థతకు గురయ్యారు. దీనిపై 1999లో ‘భోపాల్ ఎక్స్‌ప్రెస్’, 2014లో ‘భోపాల్- ఏ ప్రేయర్ ఫర్ రెయిన్’ పేరుతో ఇప్పటికే రెండు చిత్రాలు వచ్చాయి. అప్పట్లో ఈ రెండు చిత్రాలు కూడా భోపాల్ లో ఆనందంగా ఉండాల్సిన వేలాది కుటుంబాల జీవితాలు ఎంత దుర్భరంగా మారాయో దర్శకులు కళ్ళకు కట్టినట్లు చూపించారు. దీనితో ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను మనసులను ద్రవింపజేసాయి.
అయితే 2014 తరువాత ఈ ఘటనపై ఎలాంటి సినిమాలు కూడా రాలేదు. దీనికి తోడు ఈ సినిమాలను ఇంతవరకు ఏ ఓటిటి ఫ్లాట్ ఫాంలో కూడా రిలీజ్ చేయలేదు. దీనితో యస్ రాజ్ ఫిల్స్మ్ ఈ ఘటనపై ‘‘ది రైల్వే మెన్’’ పేరుతో వెబ్ సిరీస్ ను నిర్మించింది. ఈ సిరీస్ నవంబర్ 18 నుండి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. దీనితో ‘‘ది రైల్వే మెన్’’ వెబ్ సిరీస్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read : Mega Star: చిరంజీవి కోసం కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్న దర్శకుడు