The Goat Life: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు బ్లెస్సీ దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం). బతుకుదెరువు కోసం కేరళ నుంచి సౌదీకి వెళ్లిన నజీబ్ అనే వ్యక్తి జీవిత కథ ఆధారంగా బ్లెస్సీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో అమలపాల్ కథానాయిక. ‘దిగోట్ లైఫ్’ పేరుతో ఈ సినిమా ఇంగ్లీష్ లోను ‘ఆడు జీవితం’ పేరుతో మలయాళం, హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్ లో సెలబ్రిటీ ప్రీమియర్ షోను ప్రదర్శించారు. ఈ సెలబ్రిటీ ప్రీమియర్ షో లో హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, హాలీవుడ్ నటుడు జిమ్మీ జీన్ లూయిస్, నిర్మాత వై రవిశంకర్, నవీన్ యెర్నేని, మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశి, దర్శకులు హను రాఘవపూడి, అజయ్ భూపతి, శివ నిర్వాణ, పి.మహేశ్ బాబు, ప్రవీణ్ సత్తారు, శ్రీను వైట్ల, కిషోర్ తిరుమల, చంద్రసిద్ధార్థ్ పాల్గొన్నారు.
The Goat Life Premier Show
ఈ సెలబ్రిటీ ప్రీమియర్ షో చూసి అద్భుతమైన సినిమా చూశామంటూ పలువరు దర్శకులు ప్రశంసించారు. జీవితంలో ఒకసారే ఇలాంటి గొప్ప సినిమా చేసే అవకాశం వస్తుందని, ఈ సినిమాకు అన్ని అవార్డ్స్ దక్కుతాయని సెలబ్రిటీలు “ది గోట్ లైఫ్(The Goat Life)” సినిమా మీద ప్రశంసలు కురిపించారు. ది బెస్ట్ సర్వైవల్ మూవీ అని, ఒక క్లాసిక్ గా మిగిలిపోతుందని డైరెక్టర్స్ అభిప్రాయపడ్డారు. ఈ సినిమాకు మూవీ టీమ్ పెట్టిన ఎఫర్ట్స్ కు హ్యాట్సాప్ చెబుతూ కొన్ని ఏళ్లపాటు ఒక క్యారెక్టర్ తో ట్రావెల్ అవడం సాధారణ విషయం కాదని అభినందించారు. “ది గోట్ లైఫ్” సినిమా బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ ఈ సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో నిర్మించింది. “ది గోట్ లైఫ్” ప్రేక్షకులకు కొత్త సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ ఇవ్వనుంది.
జాతీయ అవార్డు గ్రహీత బ్లెస్సీ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో భారతీయ భాషల్లో తెరకెక్కిస్తున్న సినిమా’ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం). థ్రిల్లింగ్ సర్వైవల్ అడ్వెంచర్‌గా వస్తున్న ఈ సినిమాలో అమలాపాల్ కథానాయకగా నటించగా ఆస్కార్ అవార్డు గ్రహీతలు A.R.రెహమాన్ సంగీతం అందించారు. సౌండ్ ఇంజనీర్ రసూల్ పూకుట్టి, భారతదేశంలో అత్యధిక అవార్డులు పొందిన ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ వంటి టాప్ టెక్నీషియన్స్ తో ఈ చిత్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కించారు.
Also Read : Natural Star Nani: బ్రిటిష్ డిప్యూటీ కమిషనర్ తో నేచురల్ స్టార్ నాని భేటీ !