The Family Man 3 : రాజ్, డీకే దర్శకత్వంలో వచ్చిన వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మాన్’ చాలా పెద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇంతకు ముందు ఈ వెబ్ సిరీస్ రెండు సీజన్ లు వచ్చింది, ఇప్పుడు మూడో సీజన్ కి సమాయత్తం అవుతోంది. ఇందులో మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి జంటగా నటించిన విషయం కూడా తెలిసిందే. మనోజ్ బాజ్ పాయ్ ఇందులో ఒక స్పై గా కనపడతారు, అతను చేసిన శ్రీకాంత్ తివారి పాత్ర ప్రతి ఇంట్లో సుపరిచితం అయిపొయింది అంటే, ఆ పాత్రలో మనోజ్ అంతగా మమేకం అయిపోయారు.
The Family Man 3 Updates
ఆగస్టు 15 నుండి సందీప్ కిషన్(Sundeep Kishan), మురళి శర్మ లు లండన్ ఈ ‘ఫ్యామిలీ మాన్’ చిత్రీకరణకు వెళుతున్నట్టుగా భోగట్టా. సందీప్ కిషన్ ఇప్పుడు తెలుగు సినిమా ‘మజాకా’ చిత్రీకరణతో బిజీగా వున్నాడు. అయితే ఇప్పుడు ఆ సినిమాకి కొంతకాలం గ్యాప్ ఇచ్చి, ఈ ‘ఫ్యామిలీ మాన్’ చిత్రీకరణకు లండన్ వెళుతున్నట్టుగా తెలిసింది. అతనితో పాటు మురళి శర్మ కూడా చిత్రీకరణలో పాల్గొంటున్నట్టుగా తెలిసిందే. రాజ్, డీకేలు సందీప్ కిషన్ కి స్నేహితులు అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. సందీప్ కిషన్ నటించిన తమిళ సినిమా ‘రాయన్’ ఈ నెల 26జ విడుదలవుతోంది. ధనుష్ కథానాయకుడిగా, దర్శకుడిగా చేస్తున్న ఈ సినిమాలో సందీప్ కిషన్ ఒక ముఖ్య పాత్రలో కనపడనున్నాడు. ఇది తమిళం, తెలుగులో ఒకేసారి విడుదలవుతోంది.
Also Read : Hero Suriya : నెట్టింట తెగ వైరల్ అవుతున్న సూర్య బర్త్ డే స్పెషల్ బిజిఎం