ఈ ఏడాది బాలీవుడ్ కు బాగా అచ్చొచ్చినట్లుంది. కింగ్ ఖాన్ నటించిన పఠాన్ , జవాన్ బాక్సులు బద్దలు కొట్టాయి. ఇక సన్నీ డియోల్ నటించిన గదర్ మూవీ సీక్వెల్ సినిమా సైతం రికార్డుల మోత మోగించింది. మెల మెల్లగా పాజిటివ్ టాక్ తో దూసుకు పోతున్నాయి.
మరో వైపు ఖాన్ తో డుంకీ మూవీ తీస్తున్నాడు. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక జవాన్ బిగ్ సక్సెస్ తో దానిని కూడా సీక్వెల్ తీసే పనిలో ఉన్నట్టు టాక్. కానీ ఇంకా దీనికి సంబంధించి ఇంకా రివీల్ చేయలేదు దర్శకుడు అట్లీ కుమార్.
తాజాగా భూమి ఫడ్నేకర్ తీసిన థ్యాంక్యూ ఫర్ కమింగ్ 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య సక్సెస్ టాక్ తెచ్చుకుంది. మొదటి నుంచీ సినిమాపై మంచి పట్టుండడంతో తెర కెక్కించడంలో మరింత ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది.
ఇదిలా ఉండగా థ్యాంక్యూ ఫర్ కమింగ్ చిత్రం తొలి రోజు రూ. 1.06 కోట్లు, రెండో రోజు శనివారం రూ. 1.56 కోట్లు సాధించింది. ఇక ఆదివారం కావడంతో భారీ ఎత్తున ప్రేక్షకులు వస్తారని మూవీ మేకర్స్ భావిస్తున్నారు. ఆకట్టుకునే కథనం, ఆలోచింప చేసే పాత్రలు, వెరసి సంగీతం అన్నీ సమ పాలల్లో ఉండేలా జాగ్రత్త పడ్డారు అనిపిస్తోంది.