తమిళ సినీ రంగంలో క్రియేటర్లకు కొదవే లేదు. ఒక్కో దర్శకుడిది ఒక్కో టేస్ట్. ప్రస్తుతం యువ దర్శకుల హవా కొనసాగుతోంది. లోకేష్ కనగరాజ్ , నెల్సన్ దిలీప్ కుమార్ , జ్ఞాన వేల్ తో పాటు పా రంజిత్ ఉన్నారు . ఇప్పటికే పా సూపర్ స్టార్ రజనీకాంత్ తో కాలా తీశాడు. ఇది సెన్సేషన్ క్రియేట్ చేసింది.
తాజాగా ప్రముఖ నటుడు విక్రమ్ తో తంగళన్ తీస్తున్నాడు. దీనిపై ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. పా రంజిత్ ఎక్కువగా పుస్తకాలు చదువుతూ , సమాజ హితం కోసం పని చేస్తాడు. జనం సమస్యలు, ప్రత్యేకించి కులం , మతం ఎలా మనుషుల్ని విభజించేలా చేస్తున్నాయనే దానిపై ఫోకస్ పెట్టాడు. తన ప్రతి సినిమాలో సామాజిక సందేశం దాగి ఉంటుంది.
ఇక తంగళన్ చిత్రం పూర్తిగా యధార్థ ఘటన ఆధారంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు పా రంజిత్. కర్ణాటక లోని కోలార్ గోల్డ్ మైన్స్ లో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా షూటింగ్ కొనసాగుతోంది. సినిమాకు సంబంధించి పోస్టర్స్ , టీజర్ సంచలనంగా మారింది.
ఇక టేకింగ్ లో మేకింగ్ లో తనదైన స్పెషాలిటీ కనబర్చడంలో మనోడు ముందంజలో ఉంటాడు పా రంజిత్. తంగళన్ మూవీలో మాళవిక మోహన్ , పార్వతి తిరువోతు కథా నాయకలుగా నటిస్తున్నారు. ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తుండడం విశేషం.