Thandel : కార్తికేయ ఫేమ్ చందు మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాణ సారథ్యంలో వచ్చిన తండేల్(Thandel) దుమ్ము రేపింది. ప్రేక్షకుల హృదయాలను మీటింది. దీనిని అద్భుతమైన దృశ్య కావ్యంగా తీర్చిదిద్దడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. రూ. 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా విడుదలై అందరి అంచనాలు తలకిందులు చేసింది. ఏకంగా తక్కువ రోజుల్లోనే రూ. 130 కోట్లకు పైగా వసూలు చేసింది.
Thandel Movie OTT Updates
సంక్రాంతి పర్వదినం సందర్బంగా భారీ చిత్రాలు విడుదలయ్యాయి. వాటిలో మెగా స్టార్ తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ నటించిన శంకర్ దర్శకత్వం వహించిన గేమ్ ఛేంజర్ కాగా బాబీ దర్శకత్వంలో నందమూరి నట సింహం బాలయ్య ,ప్రగ్యా జైశ్వాల్, ఊర్వశి రౌతేలా, శ్రద్దా శ్రీనాథ్, మీనాక్షి చౌదరి కలిసి నటించిన డాకు మహారాజ్ , అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకీ నటించిన సంక్రాంతికి వస్తున్నాం విడుదలయ్యాయి.
వీటిలో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ బోల్తా పడింది. బాలయ్య మూవీ హిట్ అయ్యింది. ఈ సినిమా రూ. 130 కోట్ల దాకా వసూలు చేసింది. ఇక ఎవరూ ఊహించని రీతిలో ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది సంక్రాంతికి వస్తున్నాం. సినీ ట్రేడ్ వర్గాలను విస్తు పోయేలా చేసింది.
ఈ తరుణంలో ఈ సినిమాలను తట్టుకుని నిలబడింది తండేల్ చిత్రం. ఇందులో పోటీ పడి నటించారు అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి. ఇక రాక్ స్టార్ అందించిన మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. తాజాగా మూవీ మేకర్స్ నుంచి కీలక అప్ డేట్ వచ్చింది. తండేల్ మూవీ వచ్చే మార్చి 14న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని. ఫ్యాన్స్ కు ఇక పండగే కదూ.
Also Read : Reba Monica John Shocking :ఛాన్స్ కోసం వెళితే కమిట్మెంట్ అడిగారు