Thandel : గీతా ఆర్ట్స్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన తండేల్ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకు పోతోంది. అంచనాలకు మించి ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కార్తికేయ చిత్రంతో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన దర్శకుడు చందు మొండేటి అద్భుతంగా తెరకెక్కించాడు ఈ సినిమాను. ప్రధానంగా అక్కినేని నాగ చైతన్య, నేచురల్ నటి సాయి పల్లవి తమ పాత్రలకు ప్రాణం పోశారు. ఇక తండేల్(Thandel) ను ఓ దృశ్య కావ్యంగా మలిచేందుకు ప్రయత్నం చేశాడు.
Thandel Movie Collections
ప్రతి సన్నివేశం గుండెకు హత్తుకునేలా తీయడంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అంతే కాదు సినిమా సక్సెస్ కు ప్రధాన కారణం వీనుల విందైన సంగీతం. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ మూవీకి ప్లస్ పాయింట్ గా నిలిచింది.
ఈనెల 7వ తేదీన తండేల్ ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ప్రేక్షకుల నుంచి. దీంతో ఫుల్ ఖుషీగా ఉన్నారు నాగ చైతన్య. ఈ మధ్యన తను ఎక్కువగా ట్రోల్ కు గురయ్యాడు. కారణం ఏమిటంటే తను పాన్ ఇండియా హీరోయిన్ సమంత ను వదిలేయడం. శోభితతో జత కట్టడం.
గ్యాప్ తర్వాత సాయి పల్లవితో నటించిన ఈ మూవీపై ఎక్కువగా దృష్టి పెట్టాడు. మొత్తంగా ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది మాత్రం కేరళ కుట్టినేని చెప్పక తప్పదు. ఇక తండేల్ మూవీ కలెక్షన్స్ పరంగా చూస్తే మూడు రోజులకే రూ. 37 కోట్లు దాటినట్లు సినీ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
1వ రోజు రూ. 11.5 కోట్లు వసూలు చేయగా 2వ రోజు రూ. 12.64 కోట్లు, 3వ రోజు రూ. 13 కోట్లు వసూలు చేసింది. అంటే మొత్తంగా రూ. 37.1 కోట్లు వసూలు చేసింది. మరో వారం రోజుల్లో రూ. 50 కోట్లు దాటే ఛాన్స్ ఎక్కువగా ఉందని టాక్.
Also Read : Hero Salmaan Khan :జైలులో ఉన్నప్పుడే హాయిగా నిద్ర పోయా