Thandel : ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో థండేల్(Thandel) మూవీ రిలీజ్ కు సిద్దమైంది. ఈనెల 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించేందుకు ప్రయత్నం చేశాడు దర్శకుడు. దీనిని పూర్తిగా గ్రామీణ నేపథ్యం కథాంశంగా తయారైంది.
Thandel Movie Hindi Trailer Updates
ఇందులో నాగ చైతన్య, సాయి పల్లవి కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా తండేల్ హిందీ వెర్షన్ ను ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ రిలీజ్ చేశారు. బహుళ భాషల్లో విడుదలవడంతో ఈ చిత్రంపై ఆసక్తి పెరుగుతోంది. గతంలో పాన్ ఇండియా వేదికగా కార్తికేయ 2 చిత్రం తీశాడు. ప్రస్తుతం తను దర్శకత్వం వహించిన తండేల్ మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ మూవీ పూర్తిగా ప్రేమ, దేశభక్తి, గ్రామీణ నేపథ్యంగా అద్భుతంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. తండేల్ మూవీ ప్రమోషన్స్ కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించిన పోస్టర్స్ , సింగిల్స్ , ట్రైలర్ ఆకట్టుకునేలా ఉందని ప్రశంసలు కురిపించారు అమీర్ ఖాన్. ఇక కోలీవుడ్ కు సంబంధించి ప్రముఖ నటుడు కార్తీ తండేల్ వెర్షన్ ను ఆవిష్కరించారు. ఇక్కడ కూడా ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్ పై దీనిని నిర్మించారు.
Also Read : Beauty Imanvi Surprised : డార్లింగ్ ఇంటి భోజనం ఇమాన్వి సంతోషం