అందాల తార తమన్నా భాటియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె తమిళ సినీ సూపర్ స్టార్ రజనీకాంత్ పై ప్రశంసల జల్లులు కురిపించారు. జీవితంలో ఎప్పుడైనా చూస్తానా అని అనుకున్నానని, కానీ దేవుడు సూపర్ స్టార్ తో నటించే అరుదైన అవకాశం ఇప్పించాడంటూ కొనియాడింది.
తనకు అనుకోకుండా ఛాన్స్ ఇప్పించినందుకు డైనమిక్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కు, జైలర్ సినిమాను ఎక్కడా తగ్గకుండా నిర్మించిన సన్ పిక్చర్స్ యాజమాన్యానికి, ప్రత్యేకించి డీఎంకే ఎంపీ కళానిధి మారన్ కు తాను రుణపడి ఉంటానని స్పష్టం చేసింది తమన్నా భాటియా.
ఇదిలా ఉండగా నెల్సన్ దిలీప్ కుమార్ రజనీకాంత్ తో జైలర్ మూవీ తీశాడు. అతి తక్కువ కాలంలోనే ఏకంగా ఇటు ఇండియాలో అటు ఓ వర్సీస్ లో రూ. 650 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో నిర్మాత సంతోషాన్ని తట్టుకోలేక రూ. 100 కోట్ల చెక్ తో పాటు ఖరీదైన కారు రజనీకాంత్ కు అందజేశాడు.
ఇదే సమయంలో తాము ఊహించని దానికంటే సక్సెస్ ఇచ్చినందుకు దర్శకుడు నెల్సన్ కు బ్లాంక్ చెక్ ఇచ్చారు మారన్. ఇక మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కు రూ. 30 కోట్లు ఇచ్చాడు. భారీ ఎత్తున ప్రతి ఒక్కరికీ సాయం చేశారు నిర్మాత. జైలర్ సక్సెస్ సందర్భంగా జ్ఞాపికను , చెక్కును అందజేశారు. ఈ సందర్బంగా రజనీకాంత్ తో నటించడం మరిచి పోలేనంది తమన్నా భాటియా..