Thalapathy : దళపతి విజయ్ చివరి సినిమా ప్రకటన వచ్చేసింది. తమిళనాడు సినిమా ఇండస్ట్రీలో అలజడిని సృష్టించే ప్రకటనను కె.వి.ఎన్. ప్రొడక్షన్స్ సంస్థ ప్రకటించింది. మూడు దశాబ్దాల ప్రయాణంలో దళపతి విజయ్ సినీ రంగంలో తిరుగులేని స్టార్‌డమ్‌తో స్టార్ హీరోగా రాణించారు. ఆయన హీరోగా రానున్న దళపతి 69 చిత్రం.. 2025 అక్టోబర్ నెలలో థియేటర్స్‌లో తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో విడుదలకానుంది. ‘ తుణివు’, వలిమై’ చిత్రాల దర్శకుడు హెచ్ వినోద్ Thalapathy69 కోసం ఓ అద్భుతమైన కథను సిద్ధం చేశారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించనుండగా.. జగదీష్ పళనిస్వామి, లోహిత్ సహ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఎన్. కే. వెంకట్ కే నారాయణ ఆధ్వర్యంలో ఈ మూవీ నిర్మితం కానుంది.
Thalapathy 69 Movie Updates
ఈ Vijay69 చిత్రం దళపతి(Thalapathy) అభిమానులకు ఎంతో ప్రత్యేకం కానుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దళపతి విధేయులైన అభిమానులకు ఈ మూవీ గుర్తుండిపోయేలా ఉండనుంది. కొంగొత్త రికార్డులను క్రియేట్ చేసేలా ఈ మూవీని రూపొందించబోతోన్నారు. కేవీఎన్ ప్రొడక్షన్ సంస్థ వదిలిన వీడియోలో దళపతి అభిమానులు ఎంతగా ఎమోషనల్ అయ్యారో అందరికీ తెలిసిందే. దళపతి పట్ల అభిమానుల ప్రేమను ఆ వీడియోలో చూడొచ్చు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. విజయ్ రాజకీయాలలోకి అడుగుపెడుతోన్న తరుణంలో.. అతను హీరోగా నటిస్తున్న చివరి సినిమా ఇది. ఈ సినిమా పోస్టర్‌లో ద టార్చ్ బేరర్ ఆఫ్ డెమోక్రసీ ఎరైవింగ్ సూన్ అంటూ.. విజయ్ రాజకీయాలలోకి వస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఆసక్తికరంగా పోస్టర్‌ని డిజైన్ చేశారు. అక్టోబరు 2025 అంటూ సినిమా రిలీజ్‌కు సంబంధించిన సమాచారం ఇవ్వడానికి కారణం 2026 తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటమే అని చెప్పుకోవచ్చు. ఆ ఎన్నికలకు ముందు విడుదల కానున్న ఈ సినిమా విజయ్ రాజకీయ అరంగేట్రానికి ఉపయోగపడేలా ఉండనుందని తెలుస్తోంది.
ఈ సినిమా అనౌన్స్‌మెంట్ సందర్భంగా కె.వి.ఎన్. ప్రొడక్షన్స్ నిర్మాతలు మాట్లాడుతూ.. ‘దళపతి విజయ్(Thalapathy)తో మాకిది మొదటి చిత్రం.. దళపతి 69వ సినిమాను హెచ్ వినోద్‌తో కలిసి చేస్తుండటం ఆనందంగా ఉంది. టార్చ్ బేరర్ అయిన విజయ్‌తో తీస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందివ్వనున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దళపతి విజయ్‌కి ఇది చివరి సినిమా కానుండటంతో.. ఇండియన్ సినిమా హిస్టరీలో నిలిచేపోయేలా, అభిమానులంతా కలిసి సెలెబ్రేట్ చేసుకునేలా చాలా గ్రాండ్‌గా తెరకెక్కించబోతున్నాం’ అని తెలిపారు.
Also Read : Jr NTR : చావుబతుకుల్లో ఉన్న అభిమానితో వీడియో కాల్ లో మాట్లాడిన ఎన్టీఆర్