తమిళ సినీ రంగంలో టాప్ హీరో తళపతి జోసెఫ్ విజయ్. మనోడి మేనరిజం డిఫరెంట్ గా ఉంటుంది. క్రియేటివ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో మూవీ విడుదలకు రెడీ అయ్యింది. ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు లియో పోస్టర్స్ చూసి.
ఒక్కో పోస్టర్ కు ఒక్కో ట్యాగ్ లైన్ తో మరింత క్యూరియాసిటీని పెంచే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ప్రత్యేకించి లోకేష్ కనగరాజ్ కు విజయ్ తో సాన్నిహిత్యం ఉంది. అందుకని మరింత ఆకర్షణీయంగా , అన్ని వర్గాలను ఆకట్టుకునేలా తీర్చి దిద్దాడు కనగ రాజ్.
లియో సినిమాలో తళపతి విజయ్ తో పాటు అందాల తార త్రిష కృష్ణన్ , ప్రతి నాయకుడి పాత్రలో సంజయ్ దత్ నటిస్తుండడంతో మూవీపై మరింత అంచనాలు నెలకొన్నాయి. ఇదే సమయంలో బీస్ట్ మూవీ ఆశించిన మేర ఆడలేదు.
అయినా ఎక్కడా తగ్గకుండా లియోలో శక్తికి మించి ప్రయత్నం చేశాడు హీరో విజయ్. కారణం ఏమిటంటే తనకు బిగ్ హిట్ కావాలి. ఇదే సమయంలో ప్రతి సినిమాలో ఓ సామాజిక సమస్యను ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. అనిరుధ్ రవిచందర్ లియోకు మ్యూజిక్ అందించాడు. ఆడియో లాంచ్ ఘనంగా జరిగింది. భారీ ఎత్తున ఫ్యాన్స్ హాజరయ్యారు.