Thalapathy Vijay : విజయ్ చివరి సినిమాగా ఆ సినిమా రేమేకా..

ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నారు...

Hello Telugu - Thalapathy Vijay

Thalapathy Vijay : తమిళ సూపర్ స్టార్ విజయ్ ‘ది గోట్’ సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లే వచ్చాయి. అయితే ఆశించిన స్థాయిలో సినిమా లేకపోవడంతో అభిమానులు బాధపడుతున్నారు. దీంతో ఆఖరి సినిమా విషయంలో మరింత శ్రద్ధ తీసుకుంటున్నాడు విజయ్(Thalapathy Vijay). కాగా ఇంతకు ముందు విడుదలైన ‘లియో’ చిత్రం ఘనవిజయం సాధించిందని చెప్పవచ్చు. ఇప్పుడు ‘దళపతి 69’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి ప్రముఖ తమిళ దర్శకుడు హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు.

కన్నడ నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్ నిర్మిస్తుండడం విశేషం. ఇప్పుడు ఈ సినిమా కథ గురించి ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నారు. పూజా హెగ్డే, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్ ఈ సినిమా టీమ్‌లో జాయిన్ అయ్యారు. అలాగే మలయాళ నటి మమతా బైజు కూడా ఈ సినిమాలో భాగమైనట్లు తెలుస్తోంది. ఇందులో విజయ్‌(Thalapathy Vijay)కి సోదరి పాత్రలో ఆమె నటిస్తున్నట్లు సమాచారం. కాగా దళపతి విజయ్ ఆఖరి సినిమా ఓ తెలుగు సినిమాకు రీమేక్ అని తెలుస్తోంది. అదేదో కాదు.. బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’. ఈ సినిమాలో కమర్షియల్ అంశాలతో పాటు అంతర్లీనంగా మంచి సందేశం కూడా ఉంది.

Thalapathy Vijay Movies Update

గుడ్ టచ్, బ్యాడ్ టచ్ తో పాటు ఆడపిల్లలను పేరెంట్స్ ఎలా పెంచాలనే మెసేజ్ ఓరియంటెడ్ కథతో తెరకెక్కిన భగవంత్ కేసరి నే తనకు సేఫ్ సైడ్ అని విజయ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ‘ దళపతి 69’ తర్వాత విజయ్ రాజకీయాల్లో బిజీ కానున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన ఇప్పటికే పార్టీని ప్రకటించడం విశేషం. అందుకే ఆయన ఆఖరి సినిమా రాజకీయాలకు సంబంధించి ఉంటుందని అంటున్నారు. సినిమా టైటిల్ రివీల్ అయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. కాగ విజయ్ రాజకీయాల్లోకి రావడంతో ఆయన అభిమానుల్లో చాలా మంది నిరాశకు లోనవుతున్నారు. ఎందుకంటే రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సినిమా రంగాన్ని పూర్తిగా వదిలేయబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయన అధికారికంగా ప్రకటించారు. ఇటీవల విజయ్ నటించిన ది గోట్ సినిమాను అక్టోబర్ 3న OTTలో విడుదల చేయనున్నారు.

Also Read : Devara-Anirudh : దేవర సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ అంత తీసుకున్నారా..

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com