Thalapathy Vijay : తమిళ చలన చిత్ర పరిశ్రమలో టాప్ హీరోగా కొనసాగుతున్న నటుల్లో దళపతి విజయ్(Thalapathy Vijay) ఒకడు. తను ప్రస్తుతం ఆఖరి చిత్రం షూటింగ్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. చేసినవి కొన్ని సినిమాలే అయినప్పటికీ బ్లాక్ బస్టర్ గా నిలిచేలా చేశాయి. రజనీకాంత్ తో పోటీ పడుతున్న ఏకైక నటుడు కూడా తనే కావడం విశేషం. తన మేనరిజం డిఫరెంట్ గా ఉంటుంది. డ్యాన్సులు, ఫ్లైట్లు, డైలాగులు ఇలా ప్రతిదానిలో తనకంటూ ఓ ప్రత్యేకత ఉంది. ఇదే సమయంలో తను ఇటీవలే కొత్త పార్టీ కూడా పెట్టాడు.
Thalapathy Vijay Movie Re-release
తను ఏ సినిమా చేసినా దానిలో సామాజిక సందేశం ఉండేలా జాగ్రత్త పడ్డాడు. ఏఆర్ మురుగదాస్ తో తను నటించిన సర్కార్ రికార్డుల మోత మోగించింది. ఆ తర్వాత డైనమిక్ యంగ్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వంలో విజయ్ నటించిన మెర్సల్ చిత్రం గురించి ఎంత చెప్పినా తక్కువే. కోలివుడ్ సినీ ఇండస్ట్రీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డ్ సృష్టించింది.
తాజాగా దళపతి విజయ్, అట్లీ మూవీ మెర్సల్ కు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. తన ఫ్యాన్స్ కు తీపి కబురు చెప్పింది. 2017లో విడుదలైన ఈ చిత్రాన్ని రీ రిలీజ్ కాబోతోంది. మార్చి 7న ముహూర్తం ఫిక్స్ చేశారు మూవీ మేకర్స్. ఇక దీనిని జియో హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోతో సహా పలు ఓటీటీ ప్లాట్ ఫారమ్ లలో చూసేందుకు వీలుంది. వీలైతే మీరు కూడా ట్రై చేయండి. టేకింగ్, మేకింగ్ ..దళపతి నటన అదుర్స్ అని అనక తప్పదు.