Thalaivar 171: ఖైదీ, మాస్టర్, విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేసిన కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్… సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ‘తలైవా171’ (వర్కింగ్ టైటిల్) గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ‘తలైవా 171’ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనుండగా… ఇందులో శివకార్తికేయన్ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాలో రజనీకాంత్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న దర్శకుడు లోకేశ్ కనగరాజ్… రజనీ కాంత్ అభిమానులకు సర్ ప్రైజ్ సిద్ధం చేస్తున్నారు.
Thalaivar 171 Movie Updates
‘తలైవా171’ కు సంబంధించి టైటిల్ రిలీజ్ టీజర్ ను ఏప్రిల్ 22న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు జూన్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను కూడా ప్రారంభించనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీనితో విజయ్-లోకేశ్, విజయ్-కార్తీ, విజయ్-కమల్ కాంబినేషన్లు చూసిన అభిమానులు విజయ్-రజనీ కాంబినేషన్ కోసం ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రజనీకాంత్(Rajinikanth)… ‘జై భీమ్’ సినిమా ఫేం టి.జి.జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘వెట్టయాన్’ (తెలుగులో ‘వేటగాడు’) లో నటిస్తున్నారు. ఇందులో అమితాబ్, ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికాసింగ్, దుషారా విజయన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
Also Read : Karthik Subbaraj: కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య !