TGEAPCET : హైదరాబాద్ – తెలంగాణ ప్రభుత్వ ఇంజనీరింగ్, వ్యవసాయం, వైద్య సాధారణ ప్రవేశ పరీక్ష (టీజీఈఏపీసీఈటీ) 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ దాదాపు పూర్తయింది. తుది దశ తాత్కాలిక కేటాయింపు ఫలితం ఆగస్టు 10న ఆదివారం విడుదల కానుంది. మూడవ, చివరి దశ సీట్ల కేటాయింపులో పాల్గొన్న అభ్యర్థులందరూ అధికారిక కౌన్సెలింగ్ వెబ్సైట్ tgeapcet.nic.inలో వారి కేటాయింపు ఫలితాలను పొందవచ్చని తెలిపింది. 10న రిలీజ్ కానుండగా ట్యూషన్ ఫీజు చెల్లింపు, స్వీయ నివేదిక 12వ తేదీ వరకు కొనసాగుతుందని పేర్కొంది ఉన్నత విద్యా మండలి. కళాశాలలో రిపోర్టంగ్ ఆగస్టు 11వ తేదీ నుంచి 13వతేదీ వరకు ఉంటుంది.
TGEAPCET Interesting Update
తుది దశ కేటాయింపు ఫలితాలకు సంబంధించి తాత్కాలిక కేటాయింపు ఫలితాన్ని తనిఖీ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి వెబ్ కౌన్సెలింగ్ లో నమోదు చేసుకున్న అభ్యర్థులు tgeapcet.nic.inలో సందర్శించాలని పేర్కొంది. కళాశాల వారీగా కేటాయింపు జాబితాలో అవసరమైన వివరాలు నమోదు చేయాలని మరోసారి వెల్లడించింది. చివరి దశ కేటాయింపు ఫలితం స్పష్టంగా పేర్కొనడం జరుగుతుందని తెలిపింది.
టీజీఈఏపీసీఈటీ 2025 కౌన్సెలింగ్ చివరి దశ కేటాయింపు ఫలితాలు అన్ని ఉన్నత విద్య కోర్సులకు ప్రవేశాలకు అర్హత ఉన్న అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తుంది. సీట్లు కేటాయించబడిన అభ్యర్థులు ఆగస్టు 11 నుండి 13 వరకు వారి సంబంధిత కళాశాలలకు అడ్మిషన్ కోసం అవసరమైన అన్ని పత్రాలతో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. టీజీఈఏపీసీఈటీ కేటాయింపు లేఖ, ఒరిజినల్ సర్టిఫికెట్లు, మార్కుల పత్రాలు, గుర్తింపు రుజువు, విశ్వ విద్యాలయం లేదా కళాశాల పేర్కొన్న ఇతర పత్రాలు సమర్పించాలని సూచించింది.
Also Read : Indian Govt – Fastag Effective Update : ఈ ఆగస్టు 15 నుంచి ఫాస్టాగ్ టోల్ ఛార్జీలపై కీలక అప్డేట్
















