Anshu Ambani : హైదరాబాద్ – నటి అన్షుపై మహిళా లోకం సిగ్గుపడేలా కామెంట్స్ చేసిన డైరెక్టర్ త్రినాథరావుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద. ఆయన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్నామని అన్నారు.
Anshu Ambani-Trinadha Rao..
త్వరలో నోటీసులు జారీ చేస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా అన్షు(Anshu Ambani)సైజులు తగ్గాయని భారీగా పెంచాలని బహిరంగ వేదికగా కామెంట్ చేశారు. తెలుగు ప్రేక్షకులు సైజులను ఎక్కువగా ఇష్ట పడతారంటూ నోరు పారేసుకున్నారు.
సామాజిక మాధ్యమాలలో డైరెక్టర్ త్రినాథరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పెద్ద ఎత్తున పోస్టులతో హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం ట్రెండింగ్ లొ కొనసాగుతున్నారు. రాను రాను సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఇలా దిగజారి మాట్లాడుతుండడం బాధాకరమని పేర్కొన్నారు.
మరో వైపు డాకూ మహారాజ్ సినిమా సక్సెస్ కావడంతో నటుడు బాలకృష్ణ నటి ఊర్వశి రౌటేలాతో కలిసి చేసిన డ్యాన్స్ మరీ జుగుస్సాకరంగా ఉంది. తాజాగా ఈ వీడియో కూడా ఇప్పుడు హల్ చల్ చేస్తోంది నెట్టింట్లో. బాలయ్య ప్రస్తుతం హిందూపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు.
Also Read : Hero Ajith Sensation : కారు రేస్ లో హీరో అజిత్ సెన్సేషన్