High Court : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర హైకోర్టు(High Court) సంచలన వ్యాఖ్యలు చేసింది. సినిమాలకు సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి 16 ఏళ్ల లోపు పిల్లలను సెకండ్ షోలకు అనుమతించ వద్దంటూ ఆదేశించింది. తమ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
TG High Court Giving Shock to Theatres..
పిల్లల అనుమతి విషయంపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. అడ్డగోలుగా ఎలా షోస్ కు అనుమతి ఇస్తారంటూ ప్రశ్నించింది. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం నేత సతీష్ కమాల్ బెనిఫిట్ షోస్ నిర్వహణపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు హైకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టింది హైకోర్టు.
ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసింది. పుష్ప-2 మూవీ సందర్బంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ మృతి చెందడంతో పాటు తన తనయుడు తీవ్రంగా గాయపడడం, అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది.
రాత్రి పూట ఎలాంటి షోస్ కు పిల్లలను అనుమతిస్తే ఆయా థియేటర్లను సీజ్ చేయాలని, వారి లైసెన్సులను కూడా రద్దు చేయాలని ఆదేశించింది ధర్మాసనం. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఇప్పటికే సంక్రాంతి పండుగ సందర్బంగా అడ్డగోలుగా పర్మిషన్స్ ఇచ్చింది రేవంత్ సర్కార్.
Also Read : Hero Mohan Lal Movie : మోహన్ లాల్ ఎంపురాన్ టీజర్ సూపర్