Devara : దేవర టికెట్ రేట్ల పెంపునకు అనుమతించిన తెలంగాణ సర్కార్

అక్టోబరు 9వరకూ ఐదు షోల చొప్పున రాష్ట్రంలో రిలీజైన అన్ని థియేటర్లలో ఆడించుకోవచ్చు...

Hello Telugu - Devara

Devara : జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన పాన్‌ ఇండియా సినిమా ’దేవర’ మ‌రో మూడు రోజుల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు జోరుగా సాగుతుండ‌గా రీసెంట్‌గా రిలీజ్‌ ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌గా మంచి స్పంద‌న‌ను రాబ‌ట్టుకుంటుంది. అయితే ఇప్ప‌టికే ఈ దేవ‌ర(Devara) సినిమా విడుద‌ల నేప‌థ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక జీవో రిలీజ్ చేసి టికెట్ రేట్ల పెంపున‌కు అనుమ‌తి ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

ఈక్ర‌మంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా దేవ‌ర సినిమా టికెట్ల రేట్ల పెంపుద‌ల‌కు, ప్ర‌త్యేక షోల‌కు అనుమ‌తిని ఇస్తూ ఓ కొత్త జీవో రిలీజ్ చేసింది. సెప్టెంబరు 27 న 29 థియేటర్ల‌లో మిడ్ నైట్ 1గం.కు బెనిఫిట్ షోస్‌కు, అదేవిధంగా ఉదయం 4 గంటలకు రాష్ట్రంలోని అన్ని థియేటర్ల‌లో స్పెషల్ షోస్ ప‌ర్మీష‌న్ ఇవ్వ‌డ‌మే కాకుండా టికెట్ పై రూ100 పెంపు చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది. అంతేగాక 28 సెప్టెంబరు నుంచి 6 అక్టోబర్ వరకు 9 రోజుల పాటు ఐదో షోలు వేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఇక సింగిల్ స్క్రీన్ టికెట్ రేట్లపై రూ.25 , మల్టీప్లెక్స్‌ల‌లో టికెట్ రేట్లపై రూ .50 ల పెంచుకోవ‌చ్చ‌ని తెలిపింది.

Devara Ticket Prices..

ఇక‌.. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమా మొదటి రోజు ఆరు షో లు.. అక్టోబరు 9వరకూ ఐదు షోల చొప్పున రాష్ట్రంలో రిలీజైన అన్ని థియేటర్లలో ఆడించుకోవచ్చు. టిక్కెట్‌పై రూ. 60 నుంచి రూ.135 వరకు పెంచుకొనేందుకు అనుమతిచ్చింది. మొదటి రోజు అర్ధరాత్రి 12గంటలకు బెనిఫిట్‌ షో, ఉదయం ఆరింటికే మార్నింగ్‌ షో నుంచే సినిమా ప్రదర్శనకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మాతలకు అనుమతి ఇచ్చింది. విడుదలైన రెండో రోజు(28) నుంచి తొమ్మిది రోజుల పాటు ప్రతి రోజూ ఐదు షో లు ప్రదర్శించుకోవచ్చు. అక్టోబరు 6తర్వాత సాదారణ ప్రదర్శనలు ఉంటాయి.

Also Read : Pratibha Ranta : ‘లపతా లేడీస్’ సినిమా ఆస్కార్ ఎంపికపై స్పందించిన ప్రతిభ

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com