TFC : ఈ మధ్యన నకిలీ యూట్యూబ్ థంబ్ నెయిల్స్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది టాలీవుడ్ లో. ఈ సందర్బంగా తెలుగు ఫిలిం ఛాంబర్(TFC) సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు ఫేక్ యూట్యూబ్ థంబ్ నెయిల్ లపై చర్యలు తప్పవని స్పష్టం చేసింది. యూట్యూబ్‌లో తప్పుదారి పట్టించే థంబ్‌నెయిల్‌ల సమస్య పెరుగుతుండటం పట్ల ఫిల్మ్ ఛాంబర్ తీవ్రంగా పరిగణించింది.
TFC Shockinh COmments
వీటిని స్వార్థ ప్రయోజనాల కోసం సినిమాలు, ప్రముఖులను లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండి పడింది. సంచలన ఆరోపణలు చేసింది. తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, ఈ ఆందోళనను పరిష్కరించడానికి ఛాంబర్ ఇటీవల టాలీవుడ్‌లోని వివిధ సంఘాలతో కీలకమైన సమావేశాన్ని నిర్వహించింది.
సమావేశంలో, కొన్ని YouTube ఛానెల్‌లు ఉద్దేశ పూర్వకంగా ప్రేక్షకులను ఆకర్షించడానికి తప్పుడు లేదా తప్పుదారి పట్టించే థంబ్‌నెయిల్‌లను ఎలా ఉపయోగిస్తున్నాయో, తరచుగా చిత్ర పరిశ్రమ ప్రతిష్టను దెబ్బ తీస్తున్నాయని ప్రతినిధులు చర్చించారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే, అనవసరమైన వివాదాలను సృష్టించేలా థంబ్ నెయిల్స్ ఉంటున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు చిత్ర నిర్మాతలు.
ఇందుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. సదరు డ్యామేజ్ కలిగించే ఫేక్ యూట్యూబ్ ఛానళ్లు, అవి చేసే థంబ్ నెయిల్స్ పై చర్యలు తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసింది తెలుగు ఫిలిం ఛాంబర్ . తప్పుదారి పట్టించే కంటెంట్ ను అరికట్టేందుకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు విధి విధానాలను ఖరారు చేయాలని నిర్ణయించారు.
Also Read : Mad Square Sensational :మ్యాడ్ స్క్వేర్ కలెక్షన్స్ సూపర్