Tenant: హర్రర్ చిత్రం ‘పొలిమేర’రెండు భాగాలతో కథానాయకుడిగా ఊహించని విజయం అందుకుని మంచి గుర్తింపు దక్కించుకున్న సీనియర్ నటుడు సత్యం రాజేష్(Satyam Rajesh). రాజేష్ ఇటీవల నటించిన క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ‘టెనెంట్’. ఏప్రిల్ 19న థియేటర్లలో విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు వై.యుగంధర్ దర్శకత్వం వహించగా మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. మేఘా చౌదరి, భరత్ కాంత్, చందన పయావుల, ఆడుకాలం నరేన్, ఎస్తర్ కీలకపాత్రల్లో నటించారు. ఆ తర్వాత ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా జూన్ 7 నుంచి స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఇప్పుడు మరో ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫాం ఆహాలో జూన్ 28వ తేదీ నుంచి ‘టెనెంట్’ స్ట్రీమింగ్ అవుతోంది.
Tenant – కథేమిటంటే ?
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే రాజేశ్ తన మరదలు సంధ్యను వివాహం చేసుకుని ఓ అపార్ట్‌మెంట్‌లో కాపురం పెడతాడు. అ పక్కనే మరో ఫ్లాట్‌లో రిషి అనే యువకుడు ఉంటుంటాడు అప్పటికే శ్రావణి అనే అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. ఈక్రమంలో అనుకోకుండా ఓ రోజు రిషి దగ్గరికి వస్తుంది. అదే సమయంలో గౌతమ్ భార్య సంధ్య చనిపోతుంది. కొద్ది రోజులకు రిషి, శ్రావణి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటారు. అసలు సంధ్య ఎందుకు చనిపోయింది, గౌతమ్ హత్య చేశాడా ,రిషి, శ్రావణి ఎందుకు సుసైడ్ చేసుకున్నారనే ఆసక్తికరమైన కథకథనాలతో సినిమా సాగుతూ ఆకట్టుకుంటుంది. ఈ తరం ఆడవాళ్లు సమాజంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి, అపార్ట్‌మెంట్లలో పక్క ప్లాట్లలో ఎలాంటి వారు ఉంటారో జాగురతతో ఉండాలంటూ మంచి సందేశాన్నిచ్చే ఈ సినిమా ‘టెనెంట్’ తాజాగా శుక్రవారం నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
Also Read : Odela 2 Movie : తమన్నా నటించిన ఇంటెన్సివ్ చిత్రం ‘ఓదెల 2’ కీలక అప్డేట్