Telugu Television Producers Association: వరద బాధితులకు తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ విరాళం !

వరద బాధితులకు తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ విరాళం !

Hello Telugu - Telugu Television Producers Association

Telugu Television: రెండు తెలుగు రాష్ట్రాలను అకాల వర్షాలు అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణాలోని ఖమ్మం జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నగరం ఈ వరదలకు విలవిలలాడాయి. వరదలు వచ్చి నేటికి ఇరవై రోజులు కావస్తున్నా ఇంకా స్థానికులను వరద కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. వేలాది మంది ప్రజలు ఈ వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. దీనితో వీరిని ఆదుకునేందుకు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ముందుకొచ్చారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు విరాళాలివ్వగా… తాజాగా తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ తనవంతు సాయం చేయడానికి ముందుకొచ్చింది.

Telugu Television Producers

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరద బాధితుల సహాయార్థం తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్(Telugu Television) రూ.10 లక్షల విరాళం ప్రకటించింది. ఈ సందర్భంగా తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ప్రసిడెంట్‌ ప్రసాద్‌ రావు మాట్లాడుతూ… ‘మా అసోసియేషన్‌ తరఫున ఆర్థిక సాయం చేయాలని భావించాం. ఇందులో మొత్తం 260 మంది ప్రోడ్యూసర్స్‌ ఉంటే వారిలో 60 మంది మాత్రమే యాక్టివ్‌ గా సీరియల్స్‌ చేస్తున్నారు. వారంతా రూ.5వేల నుంచి రూ.25 వేల వరకు తోచినంత విరాళమిచ్చారు. ఈ డబ్బుకు అసోసియేషన్‌ ఫండ్‌ నుంచి కొంత జోడించి రూ.10 లక్షల నుంచి రూ.15లక్షల వరకు ఎంత కలెక్ట్‌ అయితే అంత సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందిస్తాం’ అని తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగు టీవీ ప్రొడ్యూసర్స్‌ అసోసియేషన్‌ నాయకలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నటుడు, నిర్మాత ప్రభాకర్‌ మాట్లాడుతూ… ‘‘వరదల కారణంగా ప్రజలు సర్వస్వం కోల్పోయారు. ఈ వార్తలు చూసి ఎంతో బాధేసింది. మమ్మల్ని ఆదరిస్తున్న ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మా వంతు సహాయం చేయాలని అనుకున్నాం. మా తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రసాద్ రావు గారితో మాట్లాడి సీరియల్స్ నిర్మించే ప్రతి ప్రొడ్యూసర్ తమకు చేతనైనంత విరాళం ఇవ్వాలని కోరాం. అందరూ సహృదయంతో స్పందించారు. తమకు వీలైనంత సాయం చేశారు’’ అని తెలిపారు.

Also Read : Sikandar Movie : సల్మాన్ ‘సికందర్’ సినిమాలో గెస్ట్ రోల్ కి మరో అందాల తార

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com