TFC : హైదరాబాద్ – తెలుగు ఫిలిం ఛాంబర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతి సంవత్సరం సంస్థ నుంచి అవార్డులు ఇస్తామని ప్రకటించింది. తెలుగు సినిమా పుట్టిన రోజు వేడుకల్లోనే ఈ పురస్కారాలు అందజేస్తామని వెల్లడించింది. ప్రభుత్వం ఇచ్చే అవార్డులతో పాటు ఫిల్మ్ ఛాంబర్ నుంచి కూడా పురస్కారాలు ఉంటాయని తెలిపింది.
TFC Awards…
ఫిబ్రవరి 6న తెలుగు సినిమా పుట్టిన రోజు సందర్భంగా సినిమా పరిశ్రమకు చెందిన ప్రతి నటుడు ఇంటిపై, థియేటర్ వద్ద ప్రత్యేకంగా జెండా ఆవిష్కరించాలని స్పష్టం చేసింది. జెండా రూపకల్పన బాధ్యత ను పరుచూరి గోపాలకృష్ణకు అప్పగిస్తూ తీర్మానం చేసింది చలన చిత్ర పరిశ్రమ సంస్థ.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో తెలుగు సినిమా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నటులు మురళీమోహన్ , రచయిత పరిచూరి గోపాలకృష్ణ, ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, సెక్రటరీ ప్రసన్న కుమార్, దర్శకుల సంఘం అధ్యక్షులు వీర శంకర్ , జర్నలిస్ట్ రెంటాల జయదేవ్ హాజరయ్యారు.
తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించిందన్నారు పాల్గొన్న ప్రముఖులు. అద్భుతమైన సినిమాలు వస్తున్నాయని, ప్రధానంగా ఒకప్పుడు బాలీవుడ్ శాసించేదని ఇప్పుడు దక్షిణాది వైపు చూస్తున్నారంటూ పేర్కొన్నారు.
Also Read : Balagam Beauty Kavya: మెస్మరైజ్ చేస్తున్న బలగం బ్యూటీ