Telugu Film Chamber : తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా భరత్ భూషణ్ ఎన్నికయ్యారు. ఇప్పటి వరకూ ఛాంబర్ అధ్యక్షుడిగా పని చేసిన దిల్‌రాజు(Dil Raju) పదవీ కాలం ముగియడంతో ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్ష పదవికి ఠాగూర్ మధు, భరత్ భూషణ్ బరిలో దిగారు. ఉపాధ్య్యక్ష పదవికి అశోక్‌కుమార్, వైవీఎస్ చౌదరి మధ్య పోటీ జరిగింది. దాదాపు 46 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. అధ్యక్షుడిగా భరత్ భూషణ్, ఉపాధ్యక్షుడిగా అశోక్ కుమార్ గెలిచారు. ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్ , డిస్ర్టిబ్యూటర్స్, స్టూడియో సెక్టార్ లోని 46 మంది సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టగా అధ్యక్ష బరిలో ఉన్న భరత్ భూషణ్‌కు 29 ఓట్లు, ఠాగూర్ మధుకు 17 ఓట్లు వచ్చాయి. ఉపాధ్యక్ష బరిలో ఉన్న అశోక్ కుమార్‌కు 28 ఓట్లు, వైవీఎస్ చౌదరికి 18 ఓట్లు వచ్చాయి.
Telugu Film Chamber…
గతేడాది నిర్మాతల విభాగం నుంచి దిల్ రాజు టీఎఫ్‌సీసీ అధ్యక్షుడిగా గెలుపొందారు. ఆయన పదవీకాలం ముగియడంతో మళ్లీ ఎలక్షన్స్ నిర్వహించారు. ఈ మధ్యకాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలోని ఎన్నికలు కూడా రాజకీయ ఎన్నికలను సైతం తలపించేలా కనిపిస్తున్నాయి. గతంలో మా ఎన్నికల విషయంలో కూడా ఇలాంటి పరిణామాలు చాలానే చూశాము. కానీ ఈసారి ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికి పంపిణీ రంగానికి చెందిన వారిని పెంచుకోవడం జరిగింది.
Also Read : Aakasamlo Oka Tara : మరో తెలుగు సినిమా ‘ఆకాశంలో ఒక తార’ తో దుల్కర్