Telugu Dynamic Directors : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తమ అద్భుతమైన ప్రతిభా నైపుణ్యాలతో, సృజనాత్మకతకు పెద్ద పీట వేస్తూ సినిమాలు తీస్తూ వస్తున్నారు దర్శకులు. ప్రస్తుతం వీరికి ఉన్నంత డిమాండ్ ఇంకెవరికీ లేదు. ఒక్కో డైరెక్టర్ ది ఒక్కో ప్రత్యేకత. ఒక్కోరిది ఒక్కో స్టైల్. తాజాగా టాప్ డైరెక్టర్స్ గా కొనసాగుతున్న వీరంతా ఒక చోటుకు చేరారు. అరుదైన ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన తెలుగు డైరెక్టర్స్(Telugu Dynamic Directors) ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.
Telugu Dynamic Directors Photos..
నిత్యం కథలు, సినిమాలు, షూటింగ్ లో బిజీగా ఉండే డైరెక్టర్ల ఒక చోటుకు చేరడం మామూలు విషయం కాదు. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నప్పటికీ తమ మధ్య మాత్రం విడదీయలేని బంధం ఉందంటూ పేర్కొన్నారు దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli), వంగా సందీప్ రెడ్డి, సుకుమార్, కొరటాల శివ, వంశీ పైడిపల్లి, జాగర్లమూడి క్రిష్, నాగ్ అశ్విన్ , హరీశ్ శంకర్, అనిల్ రావిపూడి.
దర్శకుల విషయానికి వస్తే రాజమౌళి ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రాతో ఎస్ఎస్ఎంబీ29 సినిమా చేస్తున్నాడు. షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వంగా సందీప్ రెడ్డి యానిమల్ తర్వాత ప్రభాస్ తో స్పిరిట్ తీసే పనిలో ఉన్నాడు. సుకుమార్ పుష్ప 2 వరల్డ్ వైడ్ గా సక్సెస్ కావడంతో పుష్ప 3పై ప్లాన్ చేస్తున్నాడు.
కొరటాల శివ తారక్ తో తీసిన దేవర హిట్ కావడంతో దేవర-2 సీక్వెల్ తీసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. నాగ్ అశ్విన్ విషయానికి వస్తే తను తీసిన కల్కి బ్లాక్ బస్టర్ కావడంతో కల్కి-2పై ఫోకస్ పెట్టాడు. హరీశ్ శంకర్ ప్రస్తుతం డ్రాగన్ హీరో ప్రదీప్ రంగనాథన్ తో కథ చర్చిస్తున్నాడు. అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం భారీ సక్సెస్ తో చిరంజీవితో సినిమా తీసేందుకు రెడీ అయ్యాడు. పైడిపల్లి వంశీ సైతం కథా చర్చల్లో బిజీగా ఉన్నాడు.
Also Read : Sandeep Reddy Shocking :మూవీస్ తీయడం రిస్క్ తో కూడుకున్న పని