Gaddar Awards : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా గాయకుడు, దివంగత గద్దర్ స్మారకార్థం ప్రతి ఏటా సినీ , కళా, సాహిత్య రంగాలకు సంబంధించి అవార్డులు ఇవ్వాలని సంకల్పించింది. ఈ మేరకు కేబినెట్ కూడా ఓకే చెప్పింది. గతంలో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో నంది అవార్డులను ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ సీన్ మారింది. రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. సీఎం రేవంత్ రెడ్డి ఎవరూ ఊహించని రీతిలో సంచలన ప్రకటన చేశారు.
Telangana Govt Release Notification for Gaddar Awards
ప్రజా యుద్దనౌక గద్దర్ పేరుతోనే అవార్డులను ప్రభుత్వం ఇస్తుందని ప్రకటించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు సినీ రంగానికి చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు. కానీ సీఎం వినిపించు కోలేదు. ఎవరైనా సరే తమ నిర్ణయాన్ని కాదని అంటే వారికి చుక్కలు చూపిస్తానంటూ హెచ్చరించారు.
దీంతో తగ్గేదేలే అంటూ విర్రవీగుతూ వచ్చిన ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు కోలుకోలేని రీతిలో దెబ్బ కొట్టాడు. తాను తెర మీద హీరో అని కానీ నిజమైన హీరోలు ఈ దేశంలో సరిహద్దులో రేయింబవళ్లు విధులు నిర్వహించే సైనికులంటూ కామెంట్ చేశాడు సీఎం. ఆ తర్వాత బన్నీ అరెస్ట్ కూడా అయ్యాడు. ఆ అరెస్ట్ వెనుక తన ప్రమేయం లేదంటూ తెలిపాడు. దీంతో సినీ రంగానికి చెందిన ప్రముఖులు మూకుమ్మడిగా సీఎంతో భేటీ అయ్యారు.
గద్దర్ స్మారకార్థం తెలంగాణ సర్కార్(TG Govt) ఇవ్వబోయే సినీ అవార్డులకు తెలంగాణ చలనచిత్ర అభివృద్ది సంస్థ ఎంట్రీలను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. విధి విధానాలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాకుండా తెలంగాణ సినీ రంగానికి విశేష సేవలందించిన పైడి జయరాజ్, కాంతారావు పేర్లపై ప్రత్యేక అవార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. 2014 నుంచి 2023 వరకు అప్పటి తెలంగాణ సర్కార్ చలన చిత్ర అవార్డులు ఇవ్వక పోవడంతో వాటికి కూడా పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయించారు.
Also Read : Beauty Ketika Sharma :కేతిక శర్మ సాంగ్ కాంట్రవర్సీ