బాలీవుడ్ లో వివాదాస్పద నటిగా పేరు పొందిన కంగనా రనౌత్ ఆశలన్నీ తాను నటించిన నిజ జీవితం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం తేజస్ మూవీపైనే పెట్టుకుంది. ఆమె పి. వాసు దర్శకత్వం వహించిన తమిళ చిత్రం చంద్రముఖి-2 విడుదలైనా ఆశించినంత మేర ఆకట్టుకోలేక పోయింది. యావరేజ్ సినిమాగా మిగిలి పోయింది. తొలి మూవీలో రజనీకాంత్ , జ్యోతిక నటించారు . బాక్సాఫీసు బద్దలు కొట్టింది.
ఇక తేజస్ చిత్రం అక్టోబర్ 27న రిలీజ్ కానుంది. ఈ మేరకు మూవీ మేకర్స్ సిద్దం చేశారు. ఇందులో అత్యంత సాహసోపేతమైన పైలట్ పాత్రలో నటించింది కంగనా రనౌత్. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉంది ఈ ముద్దుగుమ్మ.
సరిహద్దుల్లో విధులు నిర్వహించే సైనికుడి భావోద్వేగమైన ప్రయాణాన్ని, ఒక భారతీయుడి మానసిక స్థితిని , వారి నైతికతపై జరిగే చర్చల ప్రభావం గురించి తెర మీద ప్రతిఫలించేలా రూపొందించారు దర్శకుడు తేజస్ మూవీని.
సైనికుల గురించి అవమానకరంగా మాట్లాడటాన్ని ఆమె తప్పు పట్టారు. దీనినే ఎక్కువగా హైలెట్ చేస్తూ సినిమా మాట్లాడుతుందన్నారు కంగనా రనౌత్. ఆమె పూర్తిగా భారతీయతకు మద్దతు తెలిపే కళాకారిణిగా గుర్తింపు పొందారు. అంతే కాదు ప్రధాన మంత్రి మోదీ టీంలో ఒకరిగా చేరి పోయారు. మొత్తంగా తేజస్ గట్టెక్కిస్తుందా అన్నది చూడాలి.