బాలీవుడ్ వివాదాస్పద నటిగా పేరు పొందిన కంగనా రనౌత్ నటించిన తేజస్ ఆశించిన దానికంటే సక్సెస్ అయ్యింది. ఈ మూవీకి సర్వేష్ మేవారా దర్శకత్వం వహించారు. తనే కథ రాశాడు. ఇది నిజ జీవితంలో జరిగిన కథ ఆధారంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. రోనీ స్క్రూవాలా తేజస్ ను నిర్మించాడు.
అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించే , నిబద్దత కలిగిన ఆర్మీ పైలట్ గా నటించింది కంగనా రనౌత్. ఇందులో నటించి మెప్పించింది. ఈ ఏడాది చంద్రముఖి సీక్వెల్ లో నటించినా ఆశించిన మేర ఆడలేదు. దీంతో కొంచెం నిరాశకు గురైంది.
కానీ జాతీయ స్థాయిలో మాత్రం అవార్డు కొట్టేసింది కంగనా రనౌత్. సినిమాకు సంబంధించి శశ్వత్ సచ్ దేవ్ అందించిన మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. కథను నడిపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. మొత్తంగా గండం గట్టెక్కినట్టేనని అనుకుంటోంది కంగనా రనౌత్. ఇక మూవీ మేకర్స్ ఇంకా వెయిటింగ్ లో ఉన్నారు.
తేజస్ ను రూ. 60 కోట్లు ఖర్చు చేసి తీశారు. కంగనా ప్రధాన పాత్రలో నటిస్తే అన్షుల్ చౌహాన్, వరుణ్ మిత్రా కూడా సహాయ పాత్రల్లో మెరిశారు. మొత్తంగా తేజస్ బహుత్ ఖుష్ అంటున్నారు చూసినోళ్లంతా.