Teja Sajja : ఇటీవలే ఐఫా అవార్డుల వేడుక ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.. ఈ వేడుకకు పెద్దెత్తున సినీ తారలు తరలి వచ్చారు. అన్ని భాషల్లో రాణించిన సినిమాలకు, టెక్నీషన్స్ కు, హీరో, హీరోయిన్స్ కు అవార్డులు ప్రధానం చేశారు. కాగా ఐఫా 2024 వేడుకకు యంగ్ హీరోలు తేజ సజ్జ(Teja Sajja), రానా హోస్ట్ లుగా వ్యవహరించారు. అయితే కొంతమంది సెలబ్రెటీల పైన తేజ, రానా చేసిన కామెంట్స్ దుమారాన్ని రేపాయి. తమ అభిమాన హీరోలను అవమానించేలా కామెంట్స్ చేశారని పలువురు ఆరోపించారు. అలాగే మితిమీరి జోక్స్ చేశారు అంటూ కూడా విమర్శలు వెల్లువెత్తాయి. కాగా వీటిపై హీరో తేజ సజ్జ(Teja Sajja) క్లారిటీ ఇచ్చారు. ఉద్దేశపూర్వకంగా ఎలాంటి కామెంట్స్ చేయలేదు అని తేజ చెప్పుకొచ్చాడు. తమకు స్క్రిప్ట్ ఇస్తే అదే చదివాం అని అన్నాడు తేజ.
Teja Sajja Comment
తేజ మాట్లాడుతూ..” ఐఫా అవార్డుల ఫంక్షన్ అంటే చాలా పెద్ద ఈవెంట్. నేషనల్ లెవల్ లో జరిగే ఈవెంట్ అది. దాని కోసం చాలా మంది స్క్రిప్ట్ రైటర్స్ పని చేస్తారు. అన్ని చెక్ చేసుకొని, ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్క్రిప్టులు రాసి మాకు ఇస్తారు. మేము స్టేజ్ పై అదే చదువుతాం.. ఏదైతే మీరు చూస్తున్నారో అవన్నీ కట్ చేసిన క్లిప్స్.. పూర్తి వీడియోలు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఆ వీడియోలు చూస్తే అర్ధమవుతుంది రానా నాపై జోక్స్ వేశారు. అందరూ వాటిని జోక్ గానే చూశారు” అని తేజ అన్నాడు.
“అలాగే నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను.. ఎంతో మంది స్టార్ హీరోలతో పని చేశాను. అందరితో నాకు మంది అనుబంధం ఉంది. వేరేవాళ్లను తక్కువ చేసి మాట్లాడే ఉద్దేశం నాకు లేదు. మేము మాట్లాడిన వాటిని సరిగ్గా అర్ధం చేసుకోకపోవడం వల్లే ఇలా జరిగింది” అని తేజ క్లారిటీ ఇచ్చాడు. అలాగే రానా కూడా దీని పై స్పందించాడు. “హీరో నాని నాకు ఓ సలహా ఇచ్చాడు. నువ్వు ఎవరిపైనైనా జోక్ వేస్తే.. అది జోక్ అని తెలిసేలా వెయ్యి. జోక్ చెప్పిన తర్వాత నవ్వండి ఇది జోక్ అని చెప్పు అన్నాడు. నెక్స్ట్ టైమ్ నుంచి ఒక సబ్ టైటిల్ వేద్దామనుకుంటున్నా..” అని రానా అన్నారు.
Also Read : Sreeleela -Allu Arjun : అల్లు అర్జున్ కు ఓ స్పెషల్ గిఫ్ట్ పంపిన ‘శ్రీలీల’