Teja Sajja: సూపర్ యోధాగా తేజ సజ్జా లుక్ అదుర్స్ !

సూపర్ యోధాగా తేజ సజ్జా లుక్ అదుర్స్ !

Hello Telugu - Teja Sajja

Teja Sajja: మెగాస్టార్ చిరంజీవి ‘చూడాలని ఉంది’ సినిమాలో బాల నటుడిగా కెరీర్ ప్రారంభించి… ‘ఓ బేబీ’ సినిమాతో హీరోగా మారి… ‘జాంబి రెడ్డి’ సినిమాతో ఫరవాలేదు అనిపించి… ‘హను-మాన్‌’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు యువ హీరో తేజ సజ్జా(Teja Sajja). ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘హను-మాన్‌’ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. దీనితో ‘హను మాన్’ లో సూపర్ హీరోగా కనిపించిన తేజ సజ్జా… ఈసారి సూపర్ యోధుడుగా కనిపించబోతున్నారు. మరోసారి అదే తరహా గ్రాండియర్ సినిమాతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Teja Sajja New Look

టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థ అయిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ‌పై కార్తీక్ ఘట్టంనేని దర్శకత్వంలో టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ నంబర్ 36గా నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించనున్న ఈ పాన్ ఇండియా మూవీని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో సూపర్ హీరో తేజ సజ్జ తన ముఖంలో ఇంటెన్సిటీ‌తో బ్యాక్ పోజ్‌లో హుందా‌గా కనిపిస్తున్నారు. ‘హనుమాన్’ చిత్రంలో సాంప్రదాయ దుస్తులలో కనిపించి మ్యాజిక్ చేసిన తేజ… ఈ సినిమాలో మాత్రం స్టైలిష్ మేకోవర్‌తో సూపర్ యోధాగా కనిపించనున్నాడనేది ఈ పోస్టర్ చూస్తుంటే తెలుస్తోంది. అలాగే ఈ పోస్టర్‌ లో తన దుస్తులపై మంటలను కూడా గమనించవచ్చు. భారీ స్థాయిలో, ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమా టైటిల్‌ని ఏప్రిల్ 18న మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.

రవితేజతో ‘ఈగల్’ తర్వాత కార్తీక్ ఘట్టంనేని మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ‌కు ఇది వరుసగా రెండవ ప్రాజెక్ట్. తేజ సజ్జ కోసం లార్జర్ దాన్ లైఫ్ స్టోరీని రెడీ చేశాడని, ఇది సూపర్ యోధ యొక్క సాహసోపేతమైన కథ అని… హై టెక్నికల్ మరియు ప్రొడక్షన్ స్టాండర్డ్స్‌లో నిర్మించే ఈ చిత్రానికి గొప్ప సాంకేతిక నిపుణులు పని చేయనున్నారని మేకర్స్ చెబుతున్నారు. ఏప్రిల్ 18న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

Also Read : Ajay Bhupathi: ఉత్తమ దర్శకుడిగా అజయ్‌ భూపతి !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com