Teeangers: కన్నడలో వచ్చిన ‘హడినెలెంటు’కి డబ్బింగ్ వర్షన్ గా తెలుగులో వచ్చిన తాజా సినిమా ‘టీనేజర్స్ 17/18’. పృథ్వీ కొననూర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మించారు. షెర్లిన్ బోస్లే, నీరజ్ మాథ్యూ, రేఖా కుడ్లిగి, సుధా బెలావుడి, భవానీ ప్రకాష్ వంటి వారు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. యదార్థ సంఘటనల ఆధారంగా నిర్మించిన ఈ చిత్రం ఫ్యామిలీ అంతా కలిసి చూసేలాఉంటుంది. ప్రస్తుతం యూత్ ఎదుర్కొంటున్న సమస్యలను ఇందులో చక్కగా చూపించారు. హనుమాన్ మీడియా ద్వారా నిర్మాత బాలు చరణ్ ఈ సినిమాని ఆహాలోకి తీసుకొచ్చారు. సెప్టెంబర్ 21 నుంచి ఆహాలోకి స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సినిమా నాలుగు గంటల్లోనే ట్రెండింగ్ లోనికి వచ్చేసింది. 12 గంటల్లో 15 మిలియన్ మినిట్ వ్యూస్‌తో ట్రెండ్ అవుతోంది.
Teeangers – అంతర్జాతీయ అవార్డులు దక్కించుకున్న ‘టీనేజర్స్ 17/18’ !
ఈ చిత్రానికి అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు వచ్చాయి. మెల్ బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్, న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్, ఒట్టావా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇలా అనేక జాతీయ, అంతర్జాతీయ వేదికల్లో టీనేజర్స్ చిత్రం అందరినీ ఆకట్టుకుని అవార్డులను సాధించింది.
Also Read : Saripodhaa Sanivaaram: ఓటీటీలోనికి నాని ‘సరిపోదా శనివారం’ ! స్ట్రీమింగ్ ఎక్కడంటే ?